E-Paper
Advertisement

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 3a లైట్ vs ఐకూ Z10R vs వన్‌ప్లస్ నార్డ్ CE 5.. ఏది బెస్ట్?

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 3a లైట్ vs ఐకూ Z10R vs వన్‌ప్లస్ నార్డ్ CE 5.. ఏది బెస్ట్?
Advertisement

Nothing 3a Lite 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE 5 5G Comparison| భారత్ మార్కెట్‌లో తాజాగా నథింగ్ కంపెనీకి చెందిన నథింగ్ ఫోన్ 3a లైట్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ మార్కెట్‌లో ఫీచర్ల పరంగా ఐకూ Z10R, వన్‌ప్లస్ నార్డ్ CE 5.. రెండు ఫోన్లతో పోటీ పడుతోంది. మూడు ఫోన్లలోనూ మంచి ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. కానీ మూడింటిలో ఏది బెటర్ ఆప్షన్ అని తెలుసుకునేందుకు వాటని పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ధర రూ.20,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో బేస్ వేరియంట్ 8GB+128GB వస్తుంది. ఇంకా పెద్ద వేరియంట్ 8GB+256GB ధర రూ.22,999.
ఐకూ Z10R 5G కూడా రూ.20,999 (8GB+128GB) నుంచి ప్రారంభమవుతుంది. 12GB+256GB వేరియంట్ ధర రూ.23,499.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G ధర కొంచెం ఎక్కువ. 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999, 12GB+256GB ధర రూ.28,999.
మూడు ఫోన్లు కూడా మంచి వేరియంట్లు ఇస్తాయి, కానీ నథింగ్, iQOO రెండు కొంచెం బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉన్నాయి.

డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు

Advertisement

నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో 6.77 అంగుళాల FHD+ ఆలోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. బయట ఎండలో కూడా సూపర్ క్లియర్ గా కనిపిస్తుంది.
ఐకూ Z10R 5Gలో కర్వ్డ్ AMOLED, 120Hz, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. గేమింగ్‌కు ఈ ఫోన్ బెటర్.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 6.77 అంగుళాల OLED ప్యానెల్, 120Hz – కలర్స్ వైబ్రెంట్, కానీ బ్రైట్‌నెస్ విషయంలో నథింగ్ కంటే తక్కువ.

ప్రాసెసర్ పనితనం

నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్.. రోజువారీ టాస్కులు, మల్టీటాస్కింగ్ స్మూత్.
ఐకూ Z10R 5Gలో మరింత పవర్‌ఫుల్ డైమెన్సిటీ 7400.. గేమింగ్, హెవీ యూస్‌కు బెటర్.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో టాప్-టైర్ డైమెన్సిటీ 8350 Alex చిప్ ఉంది. గేమింగ్‌ కోసం అయితే ఇది అద్భుతంగా ఉంటుంది. దీని AnTuTu స్కోర్ కూడా 1.47 మిలియన్+ ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్

Advertisement

మూడు ఫోన్ల కూడా ఆండ్రాయిడ్ 15తో వస్తాయి. నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో నథింగ్ OS 3.5, క్లీన్, కస్టమైజేషన్ ఆప్షన్లు ఎక్కువ.
ఐకూ Z10R 5Gలో ఫన్ టచ్ OS 15 ఉంది. ఇందులో కూడా ఫీచర్లు పుష్కలం.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో ఆక్సిజెన్ OS 15 చాలా క్లీన్, అధిక కస్టమైజేషన్ లేకుండా, 4 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్.

కెమెరా సిస్టమ్ పోలిక

నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా: 50MP మెయిన్ + 8MP అల్ట్రా‌వైడ్ + 2MP మ్యాక్రో, 16MP సెల్ఫీ. ఐకూ Z10R 5Gలో డ్యువల్ రియర్: 50MP మెయిన్ (OIS) + 2MP, 32MP సెల్ఫీ (4K వీడియో) – సెల్ఫీలకు టాప్. వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో డ్యువల్ రియర్: 50MP మెయిన్ (OIS) + 8MP, 16MP సెల్ఫీ – లో లైట్‌లో మంచి పని.

కనెక్టివిటీ ఫీచర్లు

మూటివీ 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ సపోర్ట్ చేస్తాయి. నథింగ్, వన్‌ప్లస్ లో NFC ఉంది (పేమెంట్స్‌కు బాగుంది). ఐకూ Z10Rలో ఉన్న USB 2.0 మాత్రం కొంచెం పాతది, కానీ IP68/IP69 వాటర్-డస్ట్ రెసిస్టెంట్.

బ్యాటరీ, చార్జింగ్

నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో 5000mAh బ్యాటరీ + 33W చార్జింగ్. ఐకూ Z10R 5Gలో 5700mAh + 44W ఫాస్ట్ చార్జింగ్ – రోజు మొత్తం సరిపోతుంది. OnePlus Nord CE 5 5Gలో అద్భుతమైన 7100mAh + 80W అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ – 2.5 రోజుల వరకు రన్ అవుతుంది.

Also Read: ప్రైవసీలో ఐఫోన్‌కు మించిన కొత్త ఫోన్ లాంచ్.. స్పెషల్ ఫీచర్లు ఇవే..

మీరు ఏది కొనుగోలు చేయాలి?

యూనిక్ డిజైన్ (Glyph లైట్స్) కావాలంటే నథింగ్ ఫోన్ 3a లైట్ 5G.
వాల్యూ ఫర్ మనీ, గేమింగ్ పనితనం కావాలంటే ఐకూ Z10R 5G.
భారీ బ్యాటరీ, టాప్ పెర్ఫార్మెన్స్ ముఖ్యమైతే OnePlus Nord CE 5 5G సూపర్. అయితే ధర కొంచెం ఎక్కువ కానీ వర్త్.
మీ అవసరాలు, ప్రాధాన్యం బట్టి నిర్ణయం తీసుకోండి.

 

 

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×