E-Paper
Advertisement

Ind vs SA 1st T20I: బుమ్రా 100వ వికెట్ పై వివాదం..నో-బాల్ అంటూ ట్రోల్స్‌, తెరపైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు !

Ind vs SA 1st T20I: బుమ్రా 100వ వికెట్ పై వివాదం..నో-బాల్ అంటూ ట్రోల్స్‌, తెరపైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు !
Advertisement

Ind vs SA 1st T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కటక్ వేదికగా నిన్న తొలి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాద‌వ్ సేన, గ్రాండ్ విక్టరీ కొట్టింది. దక్షిణాఫ్రికాపై ఏకంగా 101 పరుగుల గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 100 వికెట్ల క్లబ్ లో చేరిన బుమ్రా వేసిన బంతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. బుమ్రా నో-బాల్ వేసినప్పటికీ ఔట్ అంటూ అంపైర్లు తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించారని అటు సౌతాఫ్రికా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మాజీ క్రికెటర్లు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

బుమ్రా 100వ వికెట్ పై దుమారం.. అది నోబాల్ అంటూ కాంట్రవర్సీ

Advertisement

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 100 వికెట్ల క్లబ్ లో బుమ్రా చేరిపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్
వికెట్ తీశాడు బుమ్రా. దీంతో 100 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు డెవాల్డ్ బ్రెవిస్. దీంతో ఆ బంతిని సూర్య కుమార్ యాదవ్ అందుకున్నాడు. అయితే డెవాల్డ్ బ్రెవిస్ ది కీలక వికెట్ కావడంతో ఒక్కసారి నో-బాల్ కోసం చెక్ చేశారు.

రిప్లైలో చూస్తే అది నో-బాల్ గా కనిపిస్తోంది. అయినప్పటికీ, థ‌ర్డ్ అంపైర్ కూడా ఔట్ అని ప్రకటించేశాడు. దీంతో డెవాల్డ్ బ్రెవిస్ డిసప్పాయింట్ అయి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది నిజంగా నాటౌట్ అని కొంత మంది క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. రిప్లై చూసే సమయంలో థర్డ్ అంపైర్ తప్పిదం చేశాడని అంటున్నారు. అయితే అంపైర్లతో బీసీసీఐ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని సౌతాఫ్రికా అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

100 వికెట్ల క్లబ్ లో జస్‌ప్రీత్ బుమ్రా

Advertisement

టీ20 చరిత్రలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. కటక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ వీకెండ్ తీసి 100 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు జస్‌ప్రీత్ బుమ్రా. 81 మ్యాచ్ ల‌లో 100 వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. జస్‌ప్రీత్ బుమ్రా కంటే మొదటి స్థానంలో అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అర్షదీప్ సింగ్ ఏకంగా 68 మ్యాచ్ ల‌లోనే 105 వికెట్లు పడగొట్టి దుమ్ము లేపాడు. ఇక హార్దిక్ పాండ్యా 99 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు.

Also Read: Ind vs SA 1st T20I: 100 సిక్స‌ర్ల‌తో పాండ్యా, 100 వికెట్ల‌తో బుమ్రా రికార్డు.. ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా విక్ట‌రీ

 

?igsh=YzJrYXV6M3A3a2N0

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×