E-Paper
Advertisement

Mobile Offers: ఉఫ్ ఉఫ్.. వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.23,000 డిస్కౌంట్.. హమ్మయ్య ఇప్పుడు కొనేయొచ్చు..!

Mobile Offers: ఉఫ్ ఉఫ్.. వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.23,000 డిస్కౌంట్.. హమ్మయ్య ఇప్పుడు కొనేయొచ్చు..!
Advertisement

OnePlus 11 5G Price Cut: స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోవడంతో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్‌లో దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అధికంగా ఉంటున్నాయి. అందువల్ల చాలా మంది సామాన్యులు ఒక మంచి ఫోన్‌ను తక్కువ ధరలో కొనుక్కుందాం అనుకున్నా కొనుక్కోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తుంది.

అందువల్ల మీరు కూడా కొత్త OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే వన్‌ప్లస్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఏకంగా రూ.23,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. మరెందుకు ఆలస్యం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. OnePlus తాజాగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ ఆఫర్‌లను అందిస్తోంది. ఇందులో OnePlus 11 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. దాదాపు రూ. 23,000 వరకు ఆదాతో OnePlus 11 5Gని కొనుగోలు చేయవచ్చు.

Advertisement

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో OnePlus 11 5Gపై ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే ఇది మాత్రమే కాదు ఆఫర్‌తో పాటు వినియోగదారులు నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. వన్‌ప్లస్ ఈ హ్యాండ్‌సెట్‌ను గత సంవత్సరం 2023లో రూ.61,999 ధరతో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కేవలం రూ.38,999కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: తస్సాదియ్యా.. వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. రూ.3000 తగ్గింపు పొందొచ్చు..!

Advertisement

అమెజాన్‌లో OnePlus 11 5G అసలు ధర రూ. 61,999 అయినప్పటికీ.. ఇప్పుడు 37 శాతం తగ్గింపుతో దీనిని రూ.38,999లకే కొనుక్కోవచ్చు. అంటే ఏకంగా రూ. 23,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. ఈ ఫోన్ కొత్త ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ధర దాని 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ EMI కూడా ఉంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిపై రూ.35,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీనిని కొనుక్కోవచ్చు.

OnePlus 11 5G Specifications

OnePlus 11 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. OnePlus 11 5G ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3216 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా సేఫ్టీ పొందుతుంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుతే.. OnePlus 11 5G 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌పై నిర్మించిన Qualcomm Snapdragon 8 Gen 2 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 16GB LPDDR5X RAM + 256GB UFS4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. OnePlus 11 5G ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి కంపెనీ 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×