BigTV English

Vivo T3 Pro 5G: తస్సాదియ్యా.. వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. రూ.3000 తగ్గింపు పొందొచ్చు..!

Vivo T3 Pro 5G: తస్సాదియ్యా.. వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. రూ.3000 తగ్గింపు పొందొచ్చు..!

Vivo T3 Pro 5G Price: Vivo భారత మార్కెట్లో దూసుకుపోతుంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పటికి ఈ కంపెనీ నుంచి వచ్చిన టి సిరీస్‌కు దేశీయ మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు వివో T సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T3 Pro 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంది.


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే 5500mAh బ్యాటరీ అమర్చబడింది. ఇప్పుడు Vivo T3 Pro 5 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G Specifications


Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల పూర్తి HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2392 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits గరిష్ట బ్రైట్‌నెస్, HDR10+ వంటి ఫీచర్లతో వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ Adreno 720 GPUతో Qualcomm Snapdragon 7 Gen 3 (4nm) ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 8GB LPDDR4X RAM + 128GB / 256GB UFS2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.

Also Read: వివో దూకుడు.. వరుసగా మూడు ఫోన్లు.. కెమెరాలు మాత్రం పిచ్చెక్కించాయ్..!

ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత FuntouchOS 14లో పనిచేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ Vivo స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో OIS సపోర్ట్, f/1.79 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో f/2.45 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది.

సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ చేర్చబడింది. స్టీరియో స్పీకర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. దీని కారణంగా ఇది దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షణను అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. USB టైప్ C పోర్ట్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS వంటివి ఉన్నాయి.

Vivo T3 Pro 5G Price

Vivo T3 Pro 5G ధర విషయానికొస్తే.. Vivo T3 Pro 5G మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.24,999 గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో దాని 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 3వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు Vivo అధికారిక సైట్, ఇ-కామర్స్ సైట్ Flipkartలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లలో హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్‌లకు ఫ్లాట్ రూ. 3,000 తగ్గింపు లేదా ఫ్లాట్ రూ. 3,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉన్నాయి.

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×