E-Paper
Advertisement

OnePlus Discount: మిడ్ రేంజ్ వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. వన్‌ప్లస్ 15R లాంచ్ తర్వాత భారీ తగ్గింపు

OnePlus Discount: మిడ్ రేంజ్ వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. వన్‌ప్లస్ 15R లాంచ్ తర్వాత భారీ తగ్గింపు
Advertisement

OnePlus Midrange Phone Big Discount| చైనా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తాజాగా (డిసెంబర్ 17న) భారత్‌లో కొత్త మిడ్ రేంజ్ ఫోన్ OnePlus 15Rని లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త ఫోన్ లాంచ్ కాగానే అంతకంటే ముందు మిడ్ రేంజ్ OnePlus ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ 11Rకి అతి పెద్ద డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో లభిస్తోంది. బడ్జెట్‌లో ప్రీమియం పర్ఫామెన్స్ కావాలనేవాళ్లకి ఇది బెస్ట్ డీల్.

రిలయన్స్ డిజిటల్‌లో ధర ఎంత తగ్గింది?

రిలయన్స్ డిజిటల్‌లో వన్‌ప్లస్ 11R భారీ డిస్కౌంట్‌లో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కలిపి మరింత సేవింగ్స్ ఉన్నాయి. ఈ డీల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే.. స్టాక్ బట్టి మారవచ్చు.

వన్‌ప్లస్ 11R ప్రస్తుత ధర ఎంత?

Advertisement

వన్‌ప్లస్ 11R (8GB RAM + 128GB స్టోరేజ్) ధర ఇప్పుడు ఆఫర్‌లో రూ.29,999. ఫిబ్రవరి 2023లో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,999. అంటే ఇప్పుడు స్ట్రెయిట్ రూ.10,000 తగ్గింపు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మరింత తక్కువ అవుతుంది.

బ్యాంక్ ఆఫర్‌తో ధర మరింత తగ్గుతుందా?

IDBI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. గరిష్టంగా రూ.3,000. ఆఫర్ అప్లై చేస్తే ఫైనల్ ధర రూ.26,999 అవుతుంది.

మొత్తం సేవింగ్స్ ఎంత

Advertisement

లాంచ్ ధర నుంచి మొత్తం రూ.13,000 సేవింగ్స్ ఉంది. ఈ ధరలో ఇంత పర్ఫామెన్స్ ఇచ్చే ఫోన్ చాలా తక్కువ. బడ్జెట్ యూజర్లకి ఇది అద్భుతమైన డీల్.

డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉంది?

వన్‌ప్లస్ 11Rలో 6.74 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. Full HD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ప్రీమియం లుక్ ఇస్తుంది.

పర్ఫామెన్స్ ఎలా ఉంది?

క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫామెన్స్ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ స్మూత్‌గా రన్ అవుతాయి. ఎక్కువసేపు రఫ్ యూజ్ చేసినా ఎఫిషియెంట్‌ పనితీరు ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉంది?

5,000mAh బ్యాటరీ + 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కాసేపట్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. హెవీ యూజర్లకి చాలా ఉపయోగకరం.

కెమెరా ఎలా ఉంది?

వన్‌ప్లస్ 11Rలో ట్రిపుల్ రియర్ (వెనుకభాగం) కెమెరా సిస్టమ్ ఉంది. 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్‌లు ఉన్నాయి. ఎక్కువ లైటింగ్ కండీషన్స్‌లో మంచి ఫోటోలు వస్తాయి. 16MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి బాగుంది.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? దీనికి కారణం అదే..

ఇప్పుడు OnePlus 11R కొనాలా?

బడ్జెట్‌లో స్ట్రాంగ్ పర్ఫామెన్స్ కావాలంటే ఇది బెస్ట్. ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్ ఉన్న వన్‌ప్లస్ 11R మిడ్ రేంజ్ ధరలో ఇప్పుడు మంచి ఆప్షన్. కొత్త మోడల్స్ కంటే ఇది మరింత వాల్యూ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్ ఎలిజిబిలిటీ చెక్ చేసి త్వరగా కొనండి. లిమిటెడ్ ఆఫర్ కావడంతో డీల్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. OnePlus 11R ఇప్పుడు రూ.26,999కి దొరకడం సూపర్ డీల్. ఫోన్ కొనాలనే ఆలోచనే ఉంటే వెంటనే ఆర్డర్ చేయండి, ఆలస్యం చేయొద్దు.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×