E-Paper
Advertisement

Apple New Airtag: పోగొట్టుకున్న వస్తువులను వెతకడం ఇక చిటికెలో పని.. ఆపిల్ కొత్త ఎయిర్‌ట్యాగ్ వచ్చేసిందోచ్!

Apple New Airtag: పోగొట్టుకున్న వస్తువులను వెతకడం ఇక చిటికెలో పని.. ఆపిల్ కొత్త ఎయిర్‌ట్యాగ్ వచ్చేసిందోచ్!
Advertisement

Apple New Airtag: ఏదైనా అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కారు తాళాలు లేదా వాలెట్ కనిపించకపోతే వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆపిల్ తన పాపులర్ గ్యాడ్జెట్ ‘AirTag’ను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది.

ఇది చూడటానికి పాతదానిలాగే అనిపించినా.. దీని పనితీరు మాత్రం మునుపటి చాలా మెరుగ్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ దూరం నుంచి వస్తువులను కనిపెట్టడం, గట్టిగా మోగే స్పీకర్లు, చివరికి మీ ఆపిల్ వాచ్‌తోనే లొకేషన్ వెతుక్కునే ఆప్షన్.. ఇలా ఎన్నో క్రేజీ ఫీచర్లతో ఈ కొత్త ఎయిర్‌ట్యాగ్ మార్కెట్లో విడుదలైంది.

ఎంత దూరంలో ఉన్నా పట్టేయొచ్చు:

Advertisement

ఈ కొత్త ఎయిర్‌ట్యాగ్‌లో సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌ను వాడారు. దీనివల్ల లాభం ఏంటంటే.. మునుపటి కంటే చాలా ఎక్కువ దూరం నుంచే మీ వస్తువు ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. మీరు ఒక గదిలో ఉండి, మీ తాళాలు వేరే గదిలో ఎక్కడో మూలన ఉన్నా సరే.. మీ ఐఫోన్ కచ్చితమైన డైరెక్షన్స్‌తో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది.

Also Read: క్రేజీ ఆఫర్ మావా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ.24,000 తగ్గింపు, ఎక్కడో తెలుసా?

యాపిల్ వాచ్ ఉంటే చాలు:

Advertisement

ఇంతకుముందు ఎయిర్‌ట్యాగ్‌ను వెతకాలంటే ఐఫోన్ చేతిలో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మీ దగ్గర సిరీస్ 9 లేదా కొత్తవి ఏది ఉన్నా.. నేరుగా మీ వాచ్ స్క్రీన్‌పైనే వస్తువును చూసుకోవచ్చు. మీ వాచ్ వద్దకు దారి చూపిస్తూ.. వస్తువును త్వరగా పట్టేయడానికి ఈ ఎయిర్ ట్యాగ్ ఉపయోగపడుతుంది.

మోత మోగిపోవాల్సిందే:

చాలా సార్లు సోఫా లోపల లేదా బ్యాగ్ అడుగున ఎయిర్‌ట్యాగ్ ఉన్నప్పుడు దాని శబ్దం మనకు వినపడదు. అందుకే యాపిల్ దీని స్పీకర్ పవర్‌ను పెంచింది. ఇది పాత మోడల్ కంటే 50% ఎక్కువ సౌండ్ చేస్తుంది.

లగేజీ టెన్షన్ ఉండదిక:

ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ మిస్ అవుతుందేమోనన్న భయం ఇక ఉండదు. కొత్తగా వచ్చిన ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా మీ లొకేషన్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బందితో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే 50కి పైగా విమానయాన సంస్థలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ధర ఎంతంటే?

ఇక ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్ ధర విషయానికి వస్తే.. ఒక సింగిల్ యూనిట్ రూ.3,790కి లభిస్తుంది. ఒకవేళ 4 తీసుకోవాలనుకుంటే రూ.12,900కే వస్తాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీకు నచ్చిన పేరును లేదా ఎమోజీని దీనిపై ఉచితంగా చెక్కించుకోవచ్చు. అయితే ఇది వాడాలంటే మీ ఐఫోన్ iOS 26 వెర్షన్‌తో అప్డేట్ అయ్యిండాలి.

Also Read: రూ.7,499 ధరలో AI ఫీచర్లతో టెక్నో సంచలనం.. స్పార్క్ గో 2 అదిరిపోయే ఫీచర్లు ఇవే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×