E-Paper
Advertisement

OnePlus 15: ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 15 లాంచ్‌ .. లైవ్‌ ఈవెంట్‌కి కౌంట్‌డౌన్‌ మొదలు

OnePlus 15: ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 15 లాంచ్‌ .. లైవ్‌ ఈవెంట్‌కి కౌంట్‌డౌన్‌ మొదలు
Advertisement

OnePlus 15:  వన్‌ప్లస్15, ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రపంచంలో ఈ పేరే ఇప్పుడు చర్చల్లో నిలిచింది. శక్తి, శైలి, ప్రదర్శన – ఈ మూడింటినీ కలిపి పెట్టినట్లు ఈ ఫోన్ రూపకల్పన చెబుతోంది. పవర్ ఆన్. లిమిట్స్ ఆఫ్. అనే నినాదం సరైన అర్ధం వచ్చేలా వన్‌ప్లస్ ఈసారి నిజంగానే సరిహద్దులు చెరిపేసింది. నవంబర్ 13 , 2025 అనగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ అవుతుండగా, రాత్రి 8 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది.

మెటల్ ఫ్రేమ్‌తో డిజైన్

Advertisement

వన్‌ప్లస్ 15లో ఉన్న ప్రధాన ఆకర్షణ దాని డిజైన్. ఈసారి కంపెనీ పూర్తిగా కొత్త శైలిని తీసుకువచ్చింది. మెటల్ ఫ్రేమ్‌తో పాటు ప్రత్యేకమైన ఇసుక తుఫాను కలర్‌ వేరియంట్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ బాడీ సైడ్‌లు కొంచెం వంపుతో ఉండటం చేత చేతిలో పట్టుకునేటప్పుడు బరువు అనిపించదు. ప్రీమియం ఫినిషింగ్‌తో తయారైన ఈ ఫోన్‌ దృష్టి ఆకర్షించేలా ఉంది.

ఎల్‌టీపీయో ఓఎల్‌ఈడీ అధిక నాణ్యత డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.78 ఇంచుల బియోఈ తయారుచేసిన ఎల్‌టీపీయో ఓఎల్‌ఈడీ అధిక నాణ్యత డిస్‌ప్లే (BOE LTPO OLED) స్క్రీన్‌ను వన్‌ప్లస్ 15లో ఉపయోగించారు. ఇది 1.5కె రిజల్యూషన్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అంటే స్క్రోలింగ్, గేమింగ్, వీడియోలు – అన్నీ అద్భుతంగా స్మూత్‌గా కనిపిస్తాయి. స్క్రీన్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకు వెళ్లడం వలన ఎండలోనూ క్లారిటీ తగ్గదు.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌

ఇప్పుడు ప్రాసెసర్ గురించి చెప్పాలంటే, ఇందులో తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. ఈ చిప్‌సెట్ వేగం, పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ – అన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా, భారీ యాప్‌లు నడిపినా ఫోన్ వేడెక్కదు. ఏఐ ఆధారిత ప్రాసెసింగ్ కూడా ఇందులో బలంగా ఉంటుంది.

Also Read: Smartwatch Offers: ఐటెల్ ఆల్ఫా 2 ప్రో స్మార్ట్‌వాచ్‌పై బంపర్ ఆఫర్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ హంగామా..

7300mAh భారీ బ్యాటరీ

వన్‌ప్లస్ 15లో 7300mAh భారీ బ్యాటరీని వేశారు. ఇది సాధారణ వినియోగంలో రెండు రోజులు సులభంగా పనిచేస్తుంది. 120W వైర్డ్ ఛార్జింగ్‌ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే కేబుల్ అవసరం లేకుండానే వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.

కెమెరా సెటప్‌  అప్‌గ్రేడ్

కెమెరా సెటప్‌ కూడా ఈసారి చాలా అప్‌గ్రేడ్ అయ్యింది. వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. దీని వల్ల నైట్ మోడ్ ఫోటోలు, పోర్ట్రెయిట్ షాట్స్, దూరంలోని చిత్రాలు అన్నీ స్పష్టంగా వస్తాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కొత్త ఏఐ ఫీచర్లతో ఫోటోలు సహజంగా వస్తాయి.

డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో సౌండ్ క్వాలిటీ

వన్‌ప్లస్ 15 ఐపి68, ఐపి69 రేటింగ్‌తో వస్తోంది. అంటే నీటిలో పడినా, దుమ్ము, ధూళి తగిలినా ఇది సురక్షితంగానే ఉంటుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సి వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది.

ఇండియాలో ధర ఎంతంటే?

ఇప్పుడు ధరపై వస్తే, భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15 ప్రారంభ ధర రూ.72,999గా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ధర 12జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ వేరియంట్‌కి వర్తించే అవకాశం ఉంది. ప్రీమియం రేంజ్‌లో ఉన్న ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఇది కొంత తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ గేమింగ్ ప్రేమికులకు, ఫోటో లవర్స్‌కి, ఎక్కువ స్మార్ట్‌ఫోన్ వినియోగం చేసే వారికి చాలా సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, క్వాలిటీ కెమెరాలు అన్నీ కలిపి ఇది నిజంగా ఒక పూర్తి ప్యాకేజీ. టెక్నాలజీ పరంగా 2025లో ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కొత్త ప్రమాణం సృష్టించే అవకాశం ఉంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×