E-Paper
Advertisement

Jubilee Hills Bypoll Counting: శుక్రవారం జూబ్లీ హిల్స్ బైపోల్ కౌంటింగ్.. ఆ ఫిగర్ వచ్చిన వారిదే గెలుపు

Jubilee Hills Bypoll Counting: శుక్రవారం జూబ్లీ హిల్స్ బైపోల్ కౌంటింగ్.. ఆ ఫిగర్ వచ్చిన వారిదే గెలుపు
Advertisement

Jubilee Hills Bypoll Counting: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయ 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. తుది ఫలితం రెండున్నర గంటల్లోపు రావచ్చని అధికారుల అంచనా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. కౌంటింగ్ కోసం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు ఉన్నారు. ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండనున్నారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్

Advertisement

జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలుపు ఎవరిది? పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడంతో గెలుపుపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. సర్వేలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినా, సిట్టింగ్‌ స్థానం తమదేనన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్. నియోజకవర్గంలో 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం లక్షా 94 వేల 600 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆ లెక్కన అందులో సగం వచ్చినవారిదే గెలుపు అన్నమాట. సరాసరి 98 వేల ఓట్లు వచ్చినవారిదే గెలుపు. మూడు పార్టీలు ఉండడంతో కనీసం 85 వేల నుంచి 90 వేలు మధ్యలో ఓట్లు వస్తే చాలంటున్నాయి రాజకీయ పార్టీలు. గెలుపుకు దాదాపు 50 శాతం ఓట్లు కావాలి. అయితే మూడు పార్టీలు ఉండడంతో బీజేపీకి పడే ఓట్లను బట్టి ఫిగర్ ఎంతన్నది డిసైడ్ కానుంది. ఎలాగ లేదన్నా 85 వేల ఓట్లు వస్తే గెలుపు సునాయాశమే.

Advertisement

ఆ ఫిగర్ వచ్చినవారిదే గెలుపు

షేక్‌పేట, రహ్మత్‌నగర్‌ డివిజన్లలో ఎక్కువ ఓట్లు పోలైనట్టు అంచనా. ఈ రెండు ప్రాంతాల్లో 70 వేల నుంచి లక్షన్నర వరకు ఓట్లు ఉన్నాయి. ఆధిక్యం అధికంగా వచ్చినవారికి విజయం ఖాయమని అంటున్నారు. ఎర్రగడ్డ -60 వేలు, యూసుఫ్‌గూడ -58 వేలు, వెంగళరావునగర్- 54 వేలు, బోరబండ- 50 వేల ఓట్లు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో సగం కంటే తక్కువగా పోలింగ్ నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ 48.49 శాతంగా చెప్పారు అధికారులు. 34 కేంద్రాల్లో 60 శాతం పోలింగ్ నమోదు కాగా, 192 కేంద్రాల్లో 50 శాతం మందికిపైగా ఓటేశారని చెబుతున్నారు. పై విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల పార్టీలు..  సర్వేలతో అంచనాలు లేకుండా విశ్లేషణలు మొదలుపెట్టేశాయి.

ALSO READ:  అయ్య బాబోయ్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి-పులి

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల్లో ముందున్నారు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌. ఆయన ఓటేసిన 217వ కేంద్రంలో అత్యల్పంగా 28.61శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటేసిన 290వ కేంద్రంలో 32.82 శాతం, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఓటేసిన 301వ కేంద్రంలో 41.86శాతం ఓటింగ్‌ నమోదు అయినట్టు తెలుస్తోది. బోరబండ‌లోని రాజ్‌నగర్ ప్రాంతమైన 334వ కేంద్రంలో అత్యధికంగా 72.78 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు లెక్కలు చెబుతున్నాయి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×