E-Paper
Advertisement

Minister Narayana: టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ వ్యాఖ్యలపై దుమారం.. అసలు ఆయన ఏమన్నారంటే..?

Minister Narayana: టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ వ్యాఖ్యలపై దుమారం.. అసలు ఆయన ఏమన్నారంటే..?
Advertisement

నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ మాట్లాడిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టి ఉంటే తన దృష్టికి తేవాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు మంత్రి నారాయణ. జనరల్‌గా డిసెంబర్‌లో పాత రౌడీషీటర్లు ఎత్తివేస్తారు. నిజంగా మీపైనా అక్రమ కేసులు పెట్టి ఉంటే అధికారుల ద్వారా వెరిఫై చేసి కార్యకర్తలకు న్యాయం చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అసలు టీడీపీ కార్యకర్తలో మంత్రి నారాయణ ఏం మాట్లాడారో చూద్దాం.

అయితే.. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి. రౌడీషీట్‌లు క్లోజ్ చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది.. కానీ మంత్రి నారాయణ మూడు రోజుల్లో క్లోజ్ చేయిస్తానంటున్నారంటూ ఆరోపణలు చేశారు. కేసుల ఎత్తివేస్తామంటూ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు మనీ పాలిటిక్స్‌ తప్ప కార్యకర్తలు, ప్రజల బాగోగులు అవసరం లేదంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

Advertisement

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌కు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు ఇంచార్జ్‌ మేయర్ రూప్‌కుమార్ యాదవ్. చెప్పుడు మాటలు విని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్నారు రూప్‌కుమార్ యాదవ్. వైసీపీ హయాంలో అక్రమంగా పెట్టి వేధించారన్నారు.

తప్పుడు కేసులతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తల అభ్యర్థలను పరిశీలించి.. తప్పుడు రౌడీషీట్లని తెలిస్తే తొలగించి న్యాయం చేస్తానని మంత్రి నారాయణ చెప్పారన్నారు. ఇందులో తప్పేముందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ప్రశ్నించారు రూప్‌కుమార్‌యాదవ్. ఏదైనా మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుని చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడాలని ఆయన ఫైర్ అయ్యారు.

Advertisement

ALSO READ: Harish Rao: బనకచర్ల ప్రాజెక్ట్ ఆగలేదు.. నల్లమలసాగర్ పేరుతో..? హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×