E-Paper
Advertisement

OnePlus 15 vs iPhone 17: వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17.. ఇండియాలో టాప్ ట్రెండింగ్ ఫోన్స్ ఇవే, వీటిలో ఏది బెస్ట్?

OnePlus 15 vs iPhone 17: వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17.. ఇండియాలో టాప్ ట్రెండింగ్ ఫోన్స్ ఇవే, వీటిలో ఏది బెస్ట్?
Advertisement

OnePlus 15 vs iPhone 17: టెక్ రంగంలో స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఇప్పుడు అందరి చర్చకు కారణమైన రెండు ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వన్ ప్లస్ 15, ఐఫోన్ 17 మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. వన్ ప్లస్ 15 అక్టోబర్ 2025 చివర్లో చైనాలో లాంచ్ కాగా, నవంబర్ 13న గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 2025లో ఆపిల్ ఈవెంట్‌లో పరిచయమై, తెలుగు మార్కెట్‌లో కూడా డిమాండ్‌ పెరిగింది. ఈ రెండు ఫోన్‌లు తమ అప్‌డేటెడ్ డిజైన్, పెర్ ఫార్మెన్స్, ఫీచర్స్‌తో వినియోగదారుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే వాటి ధరలు, డిస్‌ప్లే నాణ్యత, కెమెరా అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, మీ అవసరాలకు ఏది సరైన ఎంపిక? ఏది బెస్ట్ అనేది మనం వివరంగా చూద్దాం.

కెమెరాలో ఎవరు కింగ్..

Advertisement

కెమెరా విషయంలో వన్ ప్లస్ 15 మూడు 50ఎంపి సెన్సార్లతో వచ్చింది. 3.5x ఆప్టికల్ జూమ్, రాత్రి ఫోటోల్లో అద్భుతమైన క్లారిటీ, లో-లైట్ పర్‌ఫార్మెన్స్‌లో స్పష్టంగా ముందుంది. ఐఫోన్ 17 రెండు 48ఎంపి సెన్సార్లతోనే ఆకట్టుకుంటోంది. మనుషుల ఫోటోల్లో స్కిన్ టోన్స్ అత్యంత సహజంగా, జీవంతంగా వస్తాయి, పోర్ట్రెయిట్ బ్లర్ ప్రొఫెషనల్ స్థాయిలో ఉంటుంది, వీడియోల్లో డాల్బీ విజన్ + సినిమాటిక్ మోడ్ ఉన్నంత సేపు ఇది నిజమైన కెమెరా ఫోన్‌లా అనిపిస్తుంది. సాధారణ ఫోటో-వీడియో క్వాలిటీలో ఐఫోన్ ముందుంటే, జూమ్, లైటింగ్ షాట్స్‌లో వన్ ప్లస్ లీడ్ చూపిస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే..

Advertisement

బ్యాటరీ పర్‌ఫార్మెన్స్‌లో వన్‌ప్లస్ 15 స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుంది. 7300mAh కెపాసిటీతో రెండు రోజులు సులభంగా నడుస్తుంది. గేమింగ్, 4కె వీడియో ఎడిటింగ్ వంటి ఎక్కువ సేపు అంటే, రాత్రి 11 గంటల వరకు 40–50శాతం ఛార్జ్ తక్కువ అని చెప్పాలి. అంతేకాదు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 25 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఐఫోన్ 17 బ్యాటరీ సైజ్ తక్కువే అయినా, ఐఓఎస్ ఆప్టిమైజేషన్ వల్ల ఒకటిన్నర రోజు కంఫర్ట్‌గా ఇస్తుంది. హెవీ యూజర్లకు వన్‌ప్లస్ 15 ఎలాంటి ఆందోళన లేకుండా సేవలందిస్తుంది. మరోవైపు ఐఫోన్ 17 బ్యాటరీ సంఖ్య పరంగా తక్కువగా కనిపించినా, ఐఓఎస్ ఆప్టిమైజేషన్ వల్ల ఎక్కువరోజులు వాడిన ఛార్జ్ సమర్థవంతంగా నిలుస్తుంది.

Also Read: Honor Magic 8 Pro vs 7 Pro: హానర్ మ్యాజిక్ 8 ప్రో vs హానర్ మ్యాజిక్ 7 ప్రో.. రెండు ఫోన్లలో ఎవరు అసలైన కింగ్?

పనితీరులో ఏది పర్‌ఫెక్ట్

పనితీరులో రెండూ అద్భుతంగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో వన్‌ప్లస్ 15 గేమింగ్‌లో ఎటువంటి లాగ్ లేకుండా సాగిపోతుంది. ఐఫొన్ 17లోని ఏ19 చిప్ స్మూత్‌నెస్‌ను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఐదేళ్ల తర్వాత కూడా ఇప్పటి లాగే వేగంగా ఉంటుంది.

ధర పరంగా ఏది బెస్ట్ ఫోన్

ధర గురించి లెక్కలు స్పష్టంగా చూస్తే వన్‌ప్లస్ 15 వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది. రూ.72,999 వద్ద లభించే ఈ మోడల్ ఇచ్చే శక్తి, వేగం, రోజంతా నిలబడే పనితీరు అన్నీ కలిపి దీన్ని విలువైన ఎంపికగా చూపిస్తాయి. మరోవైపు ఐఫోన్ 17 రూ.82,900 నుంచి ప్రారంభమవుతూ ప్రీమియం స్థాయిని కొనసాగిస్తుంది. బ్రాండ్ నమ్మకం, సాఫ్ట్‌వేర్ స్థిరత్వం వంటి అంశాలు దీనికే బలం అయినా, మొత్తం ఫీచర్లు–ధర పరంగా పోలిస్తే ఐఫోన్ 15 వినియోగదారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది.

కొనేముందు బెస్ట్ ఏదో తెలుసుకోండి

గేమింగ్, ఎక్కువ సేపు ఫోన్ వాడిన, లాంగ్ బ్యాటరీ లైఫ్, వాల్యూ ఫర్ మనీ కావాలంటే వన్‌ప్లస్ 15ని కళ్లు మూసుకొని ఎంచుకోవచ్చు. ఆపిల్ ఎకోసిస్టమ్, సహజమైన ఫోటో, వీడియో క్వాలిటీ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, ప్రీమియం ఫీల్ కావాలంటే ఐఫోన్ 17 ఎప్పుడూ నిరాశపరచదు. కానీ సాధారణ వినియోగదారుడిగా, డబ్బుకి నిజమైన విలువ కావాలంటే 2025లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 15 మాత్రమే. కాబట్టి కస్టమర్ వారికి తగ్గట్టు ఫోన్ ఎంచుకొనేటప్పుడు ఒకసారి ఏది బెస్ట్ ఫీచర్లు ఉందో సెర్చ్ చేసి కొనుగోలు చేస్తే మంచిది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×