E-Paper
Advertisement

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్‌షిప్ బెస్ట్?

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్‌షిప్ బెస్ట్?
Advertisement

OnePlus 15 vs Samsung S25 vs Pixel 10 Comparison| ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడు టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వన్‌ప్లస్ 15, శామ్‌సంగ్ గెలాక్సీ S25, గూగుల్ పిక్సెల్ 10.. ఈ మూడు ఫోన్లలో వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అవసరాలకు తగిన బెస్ట్ ఫోన్ ఏది అని తెలుసుకోవడానికి వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

వన్‌ప్లస్ 15 (12GB RAM + 256GB) ధర రూ.72,999 నుంచి మొదలవుతుంది. 16GB + 512GB వేరియంట్ ధర రూ.79,999. గూగుల్ పిక్సెల్ 10 (12GB + 256GB) ధర సుమారు రూ.79,999. కానీ ఈ రెండెంటి కంటే శామ్‌సంగ్ గెలాక్సీ S25 (12GB + 256GB) చాలా చీప్‌గా రూ.63,580 నుంచి లభిస్తుంది, అయితే శామ్‌సంగ్ 512GB మోడల్ రూ.92,999 వరకు ఉంటుంది. బడ్జెట్‌ పరంగా చూసుకుంటే శామ్‌సంగ్ బెస్ట్, కానీ వన్‌ప్లస్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ.

డిస్‌ప్లే, స్క్రీన్

Advertisement

వన్‌ప్లస్ 15లో పెద్ద 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్ ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్‌గా ఉంటుంది. పిక్సెల్ 10లో కాంపాక్ట్ 6.3 అంగుళాల Actua OLED డిస్‌ప్లే ఉంది. 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బయట కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. శామ్‌సంగ్ S25లో 6.2 అంగుళాల Dynamic AMOLED 2X స్క్రీన్, స్టెడీ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. పెద్ద స్క్రీన్ కావాలంటే వన్‌ప్లస్, చిన్నది కావాలంటే శామ్‌సంగ్ లేదా పిక్సెల్.

ప్రాసెసర్, పెర్ఫామెన్స్

వన్‌ప్లస్ 15లో సూపర్ పవర్‌ఫుల్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో టాప్. పిక్సెల్ 10లో గూగుల్ Tensor G5 ప్రాసెసర్, AI మెషిన్ లెర్నింగ్‌లో బెస్ట్. శామ్‌సంగ్ S25లో కూడా Snapdragon 8 Elite చిప్, స్పీడ్, రిలయబుల్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. గేమర్స్‌కు వన్‌ప్లస్ లేదా శామ్‌సంగ్, AI లవర్స్‌కు పిక్సెల్ బెటర్ ఆప్షన్.

కెమెరా సామర్థ్యాలు

Advertisement

వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ 50MP కెమెరాలు (మెయిన్ + అల్ట్రావైడ్ + పెరిస్కోప్ జూమ్) ఉన్నాయి. జూమ్ మరియు వెర్సటైల్ ఫోటోలకు బెస్ట్. పిక్సెల్ 10లో 48MP మెయిన్ కెమెరా, గూగుల్ అద్భుతమైన AI ఫోటోగ్రఫీ – ఎటువంటి వాతావరణంలోనైనా స్టన్నింగ్ ఫోటోలు తీయగలదు. శామ్‌సంగ్ S25లో 50MP మెయిన్ + అల్ట్రావైడ్ + టెలిఫోటో కెమెరాలున్నాయి. మంచి క్వాలిటీ ఉంది, కానీ పిక్సెల్‌కు సమానం కాదు. మూడింటిలో కెమెరా పరంగా పిక్సెల్ టాప్!

సాఫ్ట్‌వేర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్

వన్‌ప్లస్ 15లో Android 15 + ColorOS 16 – ఫీచర్స్ ఎక్కువ, కస్టమైజ్ చేసుకోవచ్చు. పిక్సెల్ 10లో ప్యూర్ Android 16 – క్లీన్, టైమ్‌లీ అప్‌డేట్స్ 7 ఏళ్లు. సామ్‌సంగ్ S25లో Android 15 + One UI 7 – ప్రొడక్టివిటీ ఫీచర్స్ బాగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోసం పిక్సెల్ బెస్ట్.

కనెక్టివిటీ, సైజు

మూడింటిలోనూ 5G, Wi-Fi, Bluetooth, NFC ఉన్నాయి. వన్‌ప్లస్ 15 పెద్దది, బరువు కూడా ఎక్కువ. పిక్సెల్ 10 బ్యాలెన్స్‌డ్ సైజు. శామ్‌సంగ్ S25 చాలా చిన్నది, లైట్‌వెయిట్ ఒక చేత్తో కూడా యూజ్ చేయడానికి సూపర్.

ఏ ఫోన్ బెస్ట్?

పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, బెస్ట్ కెమెరా జూమ్ కావాలంటే వన్‌ప్లస్ 15 తీసుకోండి. AI ఫీచర్స్, క్లీన్ సాఫ్ట్‌వేర్, అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం పిక్సెల్ 10 సూపర్. కాంపాక్ట్ డిజైన్, మంచి బ్యాలెన్స్ తక్కువ ధర కావాలంటే శామ్‌సంగ్ S25 గెలుస్తుంది. మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఎంచుకోండి – మూడు కూడా టాప్ క్లాస్ ఫ్లాగ్‌షిప్స్!

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×