E-Paper
Advertisement

TRAI Deadline: ట్రాయ్ డెడ్‌లైన్.. ఆర్థిక మోసాలను చెక్, బ్యాంకు కాల్స్‌ 1600 సిరీస్‌తో మొదలు

TRAI Deadline: ట్రాయ్ డెడ్‌లైన్.. ఆర్థిక మోసాలను చెక్, బ్యాంకు కాల్స్‌ 1600 సిరీస్‌తో మొదలు
Advertisement

TRAI Deadline: ఫోన్ ద్వారా ఆర్థిక మోసాలు పాల్పడేవారిపై ఫోకస్ చేసింది ట్రాయ్. జనవరి ఒకటి నుంచి ఆ తరహా మోసాలకు చెక్ పడనుంది. అందుకోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నడుం బిగించింది. జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు చేయాలని వివిధ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ అసలు మేటరేంటి?

జనవరి ఒకటి నుంచి ఆర్థిక మోసాలను చెక్

Advertisement

భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా , పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నియంత్రణలో ఉన్న సంస్థలు ఇకపై 1600 నెంబర్ సిరీస్‌తో ఫోన్ నెంబర్లను ఉపయోగించనున్నాయి. ఆ సిరీస్‌ నెంబర్ తో వినియోగదారులకు ఫోన్లు చేయనున్నాయి.  2026 జనవరి ఒకటి నుంచి బ్యాంకులు తమ వినియోగదారులకు చేసే ఫోన్‌కాల్స్‌ ఈ సిరీస్‌ నెంబరు నుంచే రావాలని నిర్దేశించింది.

దేశంలోని అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ రావడంతో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. తాము బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ ఖాతాదారులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఓటీపీ, నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు తీసుకుని వినియోగదారుల ఖాతా నుంచి నగదు ఖాళీ చేస్తున్నారు. ఇంకొందరు డిజిటల్ అరెస్టు పేరుతో చాలామంది మోసపోతున్నారు. వీటికి పూర్తి స్థాయిలో చెక్‌ పడనుంది. టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్‌ రంగంలోకి దిగేసింది.

Advertisement

1600 సిరీస్‌తో ఫోన్ కాల్స్ మొదలు

2026 జనవరి 1 నుంచి బ్యాంకులు తమ వినియోగదారులకు చేసే ఫోన్‌కాల్స్‌ 1600 సిరీస్ నెంబర్ నుంచే రావాలని ఆదేశాలు ఇచ్చింది. కేవలం బ్యాకింగ్ మాత్రమే కాదు ఫైనాన్స్ లావాదేవీల సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్ కంపెనీలు ఇకపై 1600 సిరీస్ నెంబర్‌ని వినియోగించనున్నాయి. ఈ నెంబర్ సిరీస్ సేవలు అమలు చేసేందుకు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 15 వరకు దశల వారీగా గడువు ఇచ్చింది ట్రాయ్‌.

ఇలాంటి పద్దతి వల్ల వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అంతేకాదు స్పామ్‌ కాల్స్ చెక్ పడనుంది. వాయిస్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసపూరిత కార్యకలాపాలు తగ్గే అవకాశముంది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి 1600 సిరీస్‌ ఫోన్‌ నంబర్లను ఉపయోగించునున్నాయి.

ALSO READ: భారీగా షాకిచ్చిన బంగారం ధరలు

మ్యూచువల్‌ ఫండ్ కంపెనీలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు సైతం వీటిని అమలు చేయనున్నాయి. క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్లకు వచ్చే ఏడాది మార్చి 15 వరకు గడువు ఇచ్చింది. ఇక సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు, పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువు ఇచ్చింది. బీమా రంగంలోని సంస్థలు ఈ సిరీస్‌ను అమలు చేసేందుకు ఐఆర్‌డీఏఐతో చర్చిస్తుంది. దానికి సంబంధించి రేపో మాపో ప్రకటన చేస్తామని తెలిపింది ట్రాయ్.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×