E-Paper
Advertisement

Smartphone Comparison: వన్‌ప్లస్ 15R vs పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e.. మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: వన్‌ప్లస్ 15R vs పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e.. మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్‌లో ఏది బెస్ట్?
Advertisement

OnePlus 15R vs Google Pixel 9a vs iPhone 16e Comparison| ఇండియాలో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో కూడా ఫ్టాగ్‌షిప్ ఫీచర్ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ తన కొత్త వన్‌ప్లస్ 15R ను లాంచ్ చేసింది. దీనికి పోటీగా మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a, ఆపిల్ ఐఫోన్ 16e ఉన్నాయి. మూడు ఫోన్లు రూ.50,000 బడ్జెట్‌లోని బయ్యర్లను టార్గెట్ చేస్తాయి. పెర్ఫామెన్స్, కెమెరా, ప్రీమియం ఫీచర్లపై ఫోకస్ చేశాయి. ఏ ఫోన్ బెస్ట్ అని ఎంచుకోవడానికి ఒక డిటెయిల్డ్ కంపారిజన్ చూద్దాం.

ధర, వేరియంట్ల పోలిక

వన్‌ప్లస్ 15R రెండు వేరియంట్లలో వస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.47,999, 12GB RAM + 512GB స్టోరేజ్ రూ.52,999 (బ్యాంక్ ఆఫర్లతో తగ్గవచ్చు). గూగుల్ పిక్సెల్ 9a సింగిల్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) రూ.44,999 నుంచి రూ.49,999 వరకు ఉంటుంది. ఐఫోన్ 16e బేస్ 128GB వేరియంట్ రూ.51,999 నుంచి రూ.59,900 వరకు ఉంది (ఆఫర్లతో తగ్గవచ్చు).

డిస్‌ప్లే, రిజల్యూషన్

Advertisement

వన్‌ప్లస్ 15Rలో 6.83 అంగుళాల పెద్ద ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది, 1.5K రిజల్యూషన్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్. గూగుల్ పిక్సెల్ 9aలో 6.3 అంగుళాల Actua pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. ఐఫోన్ 16eలో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR ఓలెడ్ డిస్‌ప్లే ఉంది, HDRలో 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

ప్రాసెసర్ పెర్ఫామెన్స్ 

వన్‌ప్లస్ 15Rలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంది, ఫ్లాగ్‌షిప్ లెవల్ పెర్ఫామెన్స్, గేమింగ్‌కు బెస్ట్ ప్రాసెసర్ ఇది. గూగుల్ పిక్సెల్ 9aలో గూగుల్ టెన్సర్ G4 చిప్ ఉంది, AI ఫీచర్లు, ఇమేజ్ ప్రాసెసింగ్‌లో స్ట్రాంగ్. ఐఫోన్ 16eలో ఆపిల్ A18 ప్రాసెసర్ ఉంది, స్మూత్ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ మంచిది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్‌పీరియన్స్ 

Advertisement

వన్‌ప్లస్ 15R ఆక్సిజన్OS 16 (ఆండ్రాయిడ్ 16 బేస్)తో వస్తుంది, కస్టమైజేషన్, స్మూత్ యానిమేషన్స్. గూగుల్ పిక్సెల్ 9a ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, క్లీన్ ఇంటర్‌ఫేస్, ఫాస్ట్ అప్‌డేట్స్. ఐఫోన్ 16e iOS 18తో వస్తుంది, లాంగ్ టర్మ్ అప్‌డేట్స్, బెస్ట్ ఆప్ ఆప్టిమైజేషన్.

RAM స్టోరేజ్ ఆప్షన్లు

వన్‌ప్లస్ 15Rలో 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ ఉంది. పవర్ యూజర్లకు, మల్టీటాస్కింగ్‌కు సూటెబుల్. గూగుల్ పిక్సెల్ 9aలో 8GB RAM + 256GB స్టోరేజ్, బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్స్, AI ఫీచర్లు. ఐఫోన్ 16eలో 128GB, 256GB, 512GB ఆప్షన్లు ఉన్నాయి, iOSలో RAM ఆప్టిమైజ్ అవుతుంది.

కెమెరా సెటప్ ఎలా ఉంది?

వన్‌ప్లస్ 15Rలో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రా-వైడ్, 32MP ఫ్రంట్ కెమెరా.
గూగుల్ పిక్సెల్ 9aలో 48MP ప్రైమరీ (OIS), 13MP అల్ట్రా-వైడ్, 13MP ఫ్రంట్ కెమెరాతో గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ సూపర్.
ఐఫోన్ 16eలో 48MP రియర్ కెమెరా (అడ్వాన్స్‌డ్ స్టెబిలైజేషన్), 12MP ఫ్రంట్ కెమెరా.

కనెక్టివిటీ ఆప్షన్లు

వన్‌ప్లస్ 15Rలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, 5G సపోర్ట్. గూగుల్ పిక్సెల్ 9aలో Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, USB 3.2 Type-C. ఐఫోన్ 16eలో Wi-Fi 7, బ్లూటూత్ 5.3, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్.

Also Read: నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, దొంగ యుపిఐ ఐడీలు.. సైబర్ దొంగలను ఇలా గుర్తుపట్టండి

డిజైన్, బరువు

వన్‌ప్లస్ 15R బరువు 218 గ్రాములు, కొంచెం హెవీ. గూగుల్ పిక్సెల్ 9a బరువు 185 గ్రాములు, కాంపాక్ట్ డిజైన్. ఐఫోన్ 16e బరువు 167 గ్రాములు మాత్రమే, స్లిమ్, లైట్.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

ఏది బెస్ట్?

మూడు ఫోన్లు రూ.50,000 లోపు మంచి ఫీచర్లు ఇస్తాయి. కానీ వేర్వేరు యూజర్లకు సూట్ అవుతాయి. వన్‌ప్లస్ 15R టాప్ పెర్ఫామెన్స్, స్మూత్ డిస్‌ప్లే, ఫాస్ట్ మల్టీటాస్కింగ్ కావాల్సినవారికి బెస్ట్. గూగుల్ పిక్సెల్ 9a.. ఎక్సలెంట్ కెమెరా, క్లీన్ ఆండ్రాయిడ్, AI ఫీచర్లు కావాల్సినవారికి మంచిది. ఐఫోన్ 16e లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్, ప్రీమియం డిజైన్, ఆపిల్ ఎకోసిస్టమ్ ఇష్టమైనవారికి సూట్. మీకు పెర్ఫామెన్స్ లేదా కెమెరా, లేదా లాంగ్ టర్మ్ రిలయబిలిటీ.. వీటిలో ఏది ప్రాధాన్యం అనే దాని బట్టి నిర్ణయించుకోండి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×