ఏపీ ప్రభుత్వం వైజాగ్ ను అన్ని రంగాల్లో అగ్రగామి నగరంగా నిలిపేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రపంచ మేటి కంపెనీలను వైజాగ్ లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ సంస్థలు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా, ఇప్పుడు వండర్ లా ముందుకొచ్చింది. ఏకంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చేపట్టిన కీలక ప్రాజెక్ట్ కాబోతోంది.
వండర్ లా హాలీడేస్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, భువనేశ్వర్, చెన్నైలో ఏర్పాటు కాగా, ఇప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేయబోతోంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకోబోతోంది. అటు తిరుపతిలో 20 ఎకరాల్లో Imagicaa World పేరుతో పార్క్ ను ఏర్పాటు చేయబోతోంది. వైజాగ్ వండర్ లా గురించి డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రకటించారు. ఇది ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఫలితంగా వచ్చిన ప్రతిపాదనగా వివరించారు. ప్రస్తుతానికి ప్రతిపాదన, MoU స్థాయిలో ఉంది. ల్యాండ్ అలాట్ మెంట్, నిర్మాణం మొదలవడం లాంటి పనులు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ప్రభుత్వం భూమి అలాట్ చేసిన తర్వాత పనులు మొదలై సుమారు 2 ఏళ్లలో పూర్తి కానుంది.
ఇతర వండర్ లా పార్కుల ఆధారంగా థ్రిల్ రైడ్స్, వాటర్ అట్రాక్షన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రసిద్ధి చెందేలా ఉంటాయి. వైజాగ్ పార్క్ లో కూడా ఇలాంటివే ఉంటాయని భావిస్తున్నారు. ల్యాండ్ రైడ్స్ విషయానికి వస్తే రోలర్ కోస్టర్లు, స్పిన్నర్స్, డ్రాప్ టవర్స్ ఉంటాయి.ప వాటర్ రైడ్స్ విషయానికి వస్తే, వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్స్, లేజీ రివర్ ఉంటుంది. కిడ్స్ జోన్ లో చిన్న పిల్లలకు సేఫ్ రైడ్స్, ప్లే ఏరియాలు ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ షోలు, రెస్ట్ ఏరియాలు ఉంటాయి. ప్రపంచ స్థాయి సేఫ్టీ స్టాండర్డ్స్ (IAAPA సర్టిఫైడ్)తో ఉంటాయి. నిర్దిష్ట డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదు. లోకల్ థీమ్‌లు బీచ్, సముద్రంను లింకప్ చేసేలా ఉండవచ్చు.
వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుతో వైజాగ్‌ను ఈస్ట్ కోస్ట్ లో ప్రముఖ అమ్యూజ్‌మెంట్ టూరిజం డెస్టినేషన్‌గా మారుతుంది. థ్రిల్లింగ్ రైడ్స్, వాటర్ అట్రాక్షన్స్, వేవ్ పూల్స్, ఫ్యామిలీ జోన్స్ వంటి వండర్‌లా సిగ్నేచర్ ఫీచర్లు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, టూరిజం బూస్ట్ అవుతుంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం MoUలు రూ. 28,977 కోట్లు ఉండగా, విశాఖపట్నం టాప్‌లో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఏకంగా ప్రభుత్వం ఆయా కంపెనీలు రూ. 11,092 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో భాగంగానే వైజాగ్ లో హైదరాబాద్ లో మాదిరిగా 50 ఎకరాల్లో వండర్ లా ను ఏర్పాటు చేయబోతున్నారు.
Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!