E-Paper
Advertisement

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 8600mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో Ace 6 Ultra లాంచ్!

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 8600mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో Ace 6 Ultra లాంచ్!
Advertisement

OnePlus Ace 6 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి అత్యాధునిక ఫీచర్లతో OnePlus Ace 6 Ultra చైనాలో విడుదలైంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఏస్ 6, ఏస్ 6టీ మోడల్స్ తర్వాత, వాటిని మించిన పర్ఫార్మెన్స్‌తో ఈ సరికొత్త ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ముఖ్యంగా గంటల తరబడి ఫోన్ వాడే వారికి, మొబైల్ గేమింగ్ అంటే పిచ్చి ఉండే వారికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే.. దీనిలో వాడిన బ్యాటరీ, ప్రాసెసర్ అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి మరి.

165Hz రిఫ్రెష్ రేట్‌..

ఈ OnePlus Ace 6 Ultra చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో.. దీని డిస్‌ప్లే ఇంకా బాగుంటుంది. దీనిలో 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది కాబట్టి.. వీడియోలు చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఇక ఫోన్ వాడేటప్పుడు ఎక్కడా తడబడకుండా ఉండేందుకు 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అంతేకాదు.. బయట ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్‌ను కూడా ఇచ్చారు.

Advertisement

Also Read: ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!

16GB వరకు ర్యామ్..

స్పీడ్ విషయంలో ఈ ఫోన్ టాప్ లెవల్‌లో ఉంటుంది. దీనిలో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక RAM విషయానికొస్తే 16GB వరకు ఆప్షన్ ఉంది. దీనివల్ల ఒకేసారి ఎన్ని యాప్స్ వాడినా చాలా వేగంగా పనిచేస్తాయి. అలాగే ఫొటోలు, వీడియోలు సేవ్ చేసుకోవడానికి 1TB వరకు భారీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మెమరీ ఫుల్ అవుతుందన్న టెన్షన్ ఇక ఉండదు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఇకపోతే ఫొటోల కోసం OnePlus Ace 6 Ultraలో 50MP మెయిన్ కెమెరా ఉంది. దీనికి OIS సపోర్ట్ ఉండటం వల్ల ఫొటోలు అస్సలు బ్లర్ అవ్వవు. ఇక ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ. ఏకంగా 8,600mAh బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఫోన్లలో ఉండే దానికంటే ఇది చాలా ఎక్కువ. దీనికి తోడు 120W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వాడుకోవచ్చు.

ధర ఎంతంటే?

ఈ OnePlus Ace 6 Ultra ధర సుమారు రూ.48,400 నుంచి మొదలవుతుంది. స్టోరేజ్ పెరిగే కొద్దీ ధర మారుతుంది. ఇక గేమింగ్ ఇష్టపడే వాళ్ల కోసం గన్ గాడ్ అనే గేమింగ్ కంట్రోలర్‌ను కూడా వన్ ప్లస్ తీసుకొచ్చింది. దీన్ని ఫోన్‌కు అటాచ్ చేసుకుని చాలా కంఫర్ట్‌గా గేమ్స్ ఆడుకోవచ్చు. దీని ధర దాదాపు రూ.6,200 వరకు ఉంది. మొత్తానికి ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: మరీ ఇంత తక్కువకా? అది కూడా 2K డిస్‌ప్లే ట్యాబ్లెట్, Redmi Pad 2 9.7 ఫీచర్లు ఇవే!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×