E-Paper
Advertisement

గేమర్స్‌కి పండగే.. 185Hz డిస్‌ప్లే, 10,000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త మొబైల్ వస్తోంది!

గేమర్స్‌కి పండగే.. 185Hz డిస్‌ప్లే, 10,000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త మొబైల్ వస్తోంది!
Advertisement

OnePlus Ace 7T Leaks: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మార్కెట్‌లో మరో కొత్త సంచలనానికి తెరలేపనుంది. ముఖ్యంగా గేమింగ్, హెవీ పర్ఫార్మెన్స్ ఇష్టపడే వారిని టార్గెట్ చేస్తూ ఒక క్రేజీ ఫోన్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో పాటు సరికొత్త పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇది OnePlus Ace 7T మోడల్ అయ్యే అవకాశం ఉంది.

సంచలన రేంజ్‌లో భారీ బ్యాటరీ:

ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన లీక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దీని బ్యాటరీ సామర్థ్యం. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. చైనా మార్కెట్లో ఇటీవల బడ్జెట్ ధరలో టర్బో 6ఎక్స్ సిరీస్‌ను ప్రకటించిన వన్‌ప్లస్.. ఇప్పుడు ఈ సరికొత్త పె1ర్ఫార్మెన్స్ ఫోన్‌తో ప్రీమియం సెగ్మెంట్‌లో దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Also Read: ఇలాంటి ప్లాన్ ఎప్పుడూ చూసుండరు.. ఒక్క రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ.. రాత్రిపూట ఫ్రీ డేటా!

తగ్గేదే లే అంటున్న ప్రాసెసర్:

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా స్క్రీన్ విషయంలోనూ వన్‌ప్లస్ ఎక్కడా తగ్గడం లేదు. 1.5K రెజల్యూషన్‌తో కూడిన 185Hz ఎల్‌టిపిఎస్ (LTPS) డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు యూజర్లకు సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

పాత మోడల్ సక్సెసర్‌గా ఎంట్రీ:

Advertisement

గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 6టీ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ రాబోతోంది. ఆ మోడల్ 165Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చి అప్పట్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌నే OnePlus 15R పేరుతో రీబ్రాండ్ చేసి విడుదల చేశారు. అయితే ఇప్పుడు రాబోయే సరికొత్త ఏస్ 7 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు ఫోన్ వేడెక్కకుండా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా అందించబోతున్నట్లు సమాచారం.

Also Read: 8000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు.. OnePlus Turbo 6X Pro వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే!

Related News

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

Big Stories

Advertisement
×