E-Paper
Advertisement

టీమిండియాకు ఆడ‌ట‌మే నాకు ఇష్టం లేదు..బీసీసీఐపై ర‌జ‌త్ తిరుగుబాటు !

టీమిండియాకు ఆడ‌ట‌మే నాకు ఇష్టం లేదు..బీసీసీఐపై ర‌జ‌త్ తిరుగుబాటు !
Advertisement

Rajat Patidar:  ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరిగే టి20లు, ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్లను తాజాగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కు షాక్ ఇచ్చిన బిసిసిఐ.. అతని కెప్టెన్సీ పీకి పారేసింది. అంతేకాదు అతన్ని తుది జట్టు నుంచి కూడా తప్పించారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును రెండుసార్లు ఛాంపియన్ చేసిన రజత్ పాటిదార్ కు ఎలాగైనా అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కొంతమంది కెప్టెన్ ఇంకా రజత్ పాటిదార్ ( Rajat Patidar ) టి20 టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడని కూడా ప్రచారం చేశారు. కానీ అతని పేరు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు బీసీసీఐ. ఈ క్రమంలో బిసిసిఐ ( BCCI) సెలక్షన్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

టీమిండియాకు ఆడ‌ట‌మే నాకు ఇష్టం లేదు..ర‌జ‌త్ తిరుగుబాటు !

Advertisement

టీమిండియాలోకి తనను తీసుకోక పోవడంపై అటు బెంగుళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా తన స్టైల్ లో స్పందించారు. పరోక్షంగా బీసీసీఐపై తిరుగుబాటు కూడా చేశారు. అసలు టీమిండియాలోకి రావడం తనకు ఇష్టం లేదని బాంబు పెంచారు. ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళు సెలెక్ట్ చేయరు.. అందుకే టీమిండియాలోకి రావడం గురించి తాను ఎప్పుడో మర్చిపోయానని తెలిపారు. ఇంకా ఎన్ని ట్రోఫీలు తీసుకువచ్చినా కూడా తన గతి ఇంతేనంటూ వ్యాఖ్యానించారు. వాళ్లు సెలక్షన్ చేస్తే ఏంటి ? చేయకపోతే ఏంటి ? నా ఆట నేను వాడుకుంటాను అంటూ సీరియస్ అయ్యారు.

తనకు పిలుపు వచ్చినప్పుడే టీమిండియాలోకి వెళ్తానని ప్రకటించారు. అప్పటివరకు వేచి చూడాల్సిన పరిస్థితి తనకు లేదని వెల్లడించారు. కానీ తన పర్ఫామెన్స్ పైన మాత్రం ఫోకస్ చేస్తానని వ్యాఖ్యానించారు. తన ఆట తీరును మరింత మెరుగుపరచుకొని.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లు వ్యవహరించిన తీరు తనకు ఏమాత్రం నచ్చలేదని ఫైర్ అయ్యారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఎవరిని సెలెక్ట్ చేయలేదని మండిపడ్డారు.

RCB ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అన్యాయం

Advertisement

ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరిగే టి20లు, ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల పైన మాత్రం దారుణంగా బీసీసీఐ వ్యవహరించిందని ఫైర్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లను సెలెక్ట్ చేయకుండా సెలెక్టర్స్ దారుణంగా వ్యవహరించారని ఫైర్ అవుతున్నారు. వెంటనే ప్రకటించిన జట్టును రద్దుచేసి… కొత్త టీమిండియా జట్టును ప్రకటించాలంటూ బెంగుళూరు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

Related News

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Big Stories

Advertisement
×