E-Paper
Advertisement

8000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు.. OnePlus Turbo 6X Pro వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే!

8000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు.. OnePlus Turbo 6X Pro వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే!
Advertisement

OnePlus Turbo 6 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ చైనా మార్కెట్లో సరికొత్త Turbo 6X సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. జూన్ 18న విడుదల కానున్న ఈ సిరీస్‌లో Turbo 6X, Turbo 6X Pro మోడల్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటి ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయిస్ లీ జీ ఈ ఫోన్ల కీలక వివరాలను అధికారికంగా వెల్లడించారు. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ ఫోన్లు రాబోతున్నాయి.

డిస్‌ప్లే ప్రత్యేకతలివే:

ఈ సిరీస్‌లో బ్యాటరీ లైఫ్‌కు కంపెనీ పెద్ద పీట వేసింది. ప్రో మోడల్ అయిన టర్బో 6ఎక్స్ ప్రోలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్ గల శాంసంగ్ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇక స్టాండర్డ్ మోడల్ అయిన టర్బో 6ఎక్స్ విషయానికొస్తే.. దీనిలో 7,000mAh బ్యాటరీతో పాటు 6.72 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ రెండు ఫోన్ల డిస్‌ప్లేలు కంటికి ఎలాంటి హాని చేయని ఐ-కేర్ ఫీచర్‌తో రావడం విశేషం.

Advertisement

Also Read: ఇక వాట్సప్ లాగిన్‌కు OTP అవసరం లేదు.. హ్యాకర్లకు షాక్ ఇచ్చిన Vi కొత్త టెక్నాలజీ!

ప్రాసెసర్, స్టోరేజ్ వివరాలు:

పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ ఫోన్లు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. టర్బో 6ఎక్స్ మోడల్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుండగా.. ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 7400 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16తో రన్ అవుతాయి. ఇరు ఫోన్లు కూడా 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్లలో లభించనున్నాయి.

కెమెరా, డిజైన్, కలర్స్:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. సాధారణ మోడల్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ప్రో మోడల్‌లో 50 ఎంపీ + 8MP వెనుక కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. టర్బో 6ఎక్స్ బ్లాక్, వైట్, గ్రీన్ కలర్స్‌లో.. ప్రో మోడల్ బ్లాక్, ఆరెంజ్ రంగుల్లో లభిస్తాయి.

ధర విషయానికొస్తే:

ఈ ఫోన్లు చైనాలో దాదాపు రూ.21వేల బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానున్నాయి. మిలిటరీ గ్రేడ్ నాణ్యత, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్, నమ్మకమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి, అలాగే కుటుంబ సభ్యులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి సరైన ఎంపిక అని కంపెనీ పేర్కొంది.

Also Read: రోబోట్ క్లీనర్ నుండి స్మార్ట్ ప్లగ్ వరకు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన బెస్ట్ అలెక్సా డివైజెస్!

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×