E-Paper
Advertisement

OnePlus Nord CE 4 Launch: వన్‌ప్లస్ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే..?

OnePlus Nord CE 4 Launch: వన్‌ప్లస్ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement
OnePlus Nord CE 4 Launch
OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 Launch: దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యూత్ సరికొత్త ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వన్‌ ప్లస్ యూత్‌ను ఆకట్టుకోవడంలో సంచలనంగా మారింది. అంతేకాకుండా దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండటంతో వారిని టార్గెట్ చేస్తూ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది.

ఈ నేపధ్యంలో వన్ ప్లస్ మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. OnePlus Nord CE 4 స్మార్ట్‌‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1న అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్‌కు తీసుకురానుంది.

Advertisement

Read More: ఐక్యూ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ లీక్!

Advertisement

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్లు

డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగా‌పిక్సెల్. ఇది 4nm Qualcomm Snapdragon 7 Gen 3 SoC ప్రాసెసర్‌‌పై నడుస్తుంది. ఇది టాప్ ఫ్రేమ్‌లో మైక్రోఫోన్ మరియు IR బ్లాస్టర్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో రానునట్లుగా వన్ ప్లస్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. గ్రీన్ మరియు బ్లాక్ కలర్ వేరియంట్‌లో రానుంది. స్టూడెంట్స్‌కు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. వన్ ప్లస్ యాప్ ద్వారా 100 రీడిమ్ పాయింట్స్‌ను ఇస్తుంది. వన్ ప్లస్ మెంబర్ షిప్ ద్వారా రూ.1200 అదనంగా ఫోన్ ధరపై డిస్కౌంట్ పొందొచ్చు.

Read More: ఐఫోన్ 15 పై క్రేజీ ఆఫర్.. మరో 4 రోజుల వరకే ఛాన్స్!

అయితే గతేడాది భారత్ మార్కెట్‌లో విడుదలైన OnePlus Nord CE 3 ధర తగ్గించింది. ఫోన్ ధర రూ.26,999 ఉండగా ప్రస్తుతం రూ. 24,999కి అమెజాన్‌‌‌లో అందుబాటులో ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇది 6.7-అంగుళాల పూర్తి హెడ్ డీ డిస్‌ప్లేను 120 వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్‌పై నడుస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×