E-Paper
Advertisement

OnePlus New Smartphone: 9,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. చార్జింగ్ టెన్షన్‌కు ఇక చెక్

OnePlus New Smartphone: 9,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. చార్జింగ్ టెన్షన్‌కు ఇక చెక్
Advertisement

OnePlus New Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నమ్మకమైన అనుభవం, స్టేబుల్ పర్‌ఫార్మెన్స్, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రత్యేక గుర్తింపు ఉన్న బ్రాండ్ వన్‌ప్లస్. మొదట ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌తో పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ, తర్వాత మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో కూడా యూజర్లను ఆకట్టుకునేలా నార్డ్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే వన్‌ప్లస్, భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌పై పని చేస్తోందన్న సమాచారం టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది.

కోడ్ నేమ్ ‘వోల్క్స్‌వాగన్’

Advertisement

రిపోర్టుల ప్రకారం ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌కి కంపెనీ అంతర్గతంగా “వోల్క్స్‌వాగన్” అనే కోడ్ నేమ్ ఉపయోగిస్తోంది. ఇది ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15 సిరీస్ కంటే కింద లైనప్‌లో ఉంటుంది. అంటే పూర్తిగా ప్రీమియం ఫోన్ కాకపోయినా, పర్‌ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఫ్లాగ్‌షిప్‌కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ధరను కూడా మిడ్ రేంజ్ యూజర్లకు అందుబాటులో ఉంచాలన్నదే వన్‌ప్లస్ ఉద్దేశంగా కనిపిస్తోంది.

స్నాప్ డ్రాగన్ 8s జెన్ – మిడ్ రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ క్లాస్ చిప్

Advertisement

ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ ప్రాసెసర్ ఉండనున్నట్టు సమాచారం. ఇది ప్రస్తుతం నార్డ్ 5లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3కి అప్‌గ్రేడ్ వర్షన్. డైలీ యూజ్‌లో స్పీడ్, మల్టీటాస్కింగ్ సమయంలో స్టేబిలిటీ, గేమింగ్‌లో స్మూత్ అనుభవం ఇవన్నీ ఈ చిప్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ లెవల్ ప్రాసెసర్ అంటేనే వన్‌ప్లస్ పెద్ద ప్లాన్ చేస్తోందని అర్థం అవుతోంది.

9,000mAh బ్యాటరీ – అసలు గేమ్ ఛేంజర్

ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 9,000mAh బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా ఫోన్లలో 5,000mAh లేదా 5,500mAh బ్యాటరీలే కనిపిస్తాయి. కానీ వన్‌ప్లస్ ఈ ఫోన్లలో భారీ బ్యాటరీ ఇవ్వడం వల్ల, ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నార్మల్ యూజ్‌లో సులభంగా నడిచే ఛాన్స్ ఉంది. హెవీ యూజ్ చేసినా బ్యాటరీ గురించి టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి.

గీక్‌బెంచ్‌లో కనిపించిన వన్‌ప్లస్ టర్బో

చైనా మార్కెట్ కోసం వచ్చే వన్‌ప్లస్ టర్బో మోడల్ ఇప్పటికే గీక్‌బెంచ్‌లో PLU110 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయినట్టు సమాచారం. అదే స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, భారీ బ్యాటరీ వివరాలు అక్కడ నమోదయ్యాయి. అంటే ఈ ఫోన్ కేవలం రూమర్ స్థాయిలో కాకుండా, యాక్టివ్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉందని స్పష్టమవుతోంది. లాంచ్ కూడా చాలా దగ్గరలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Poco M8 Series: బడ్జెట్ కిల్లర్ ఈజ్ బ్యాక్.. జనవరిలో పోకో ఎం8 సిరీస్ లాంచ్.. రెడ్‌మి, రియల్‌మిలకు గట్టి పోటీ

వన్‌ప్లస్ టర్బో లేదా వన్‌ప్లస్ నార్డ్ 6

ఈ ఫోన్ ఫైనల్‌గా ఏ పేరుతో వస్తుందన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు. చైనాలో మాత్రం వన్‌ప్లస్ టర్బో పేరుతో లాంచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే హార్డ్‌వేర్‌ను ఇతర దేశాల్లో వన్‌ప్లస్ నార్డ్ 6గా రీబ్రాండ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో కూడా వన్‌ప్లస్ ఇలానే ఒకే ఫోన్‌ను వేర్వేరు పేర్లతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

డిస్‌ప్లే – 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్

ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. రిఫ్రెష్ రేట్ 165Hz వరకు ఉండే అవకాశం ఉంది. గేమింగ్ చేస్తూ స్క్రోలింగ్ చేసినప్పుడు, సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా స్మూత్ అనుభవం ఇవ్వగలదు. ఇక్కడ ఎల్టీపీఎస్ టెక్నాలజీ వాడే ఛాన్స్ ఉంది. ఎల్టీపీఓ లాగా పూర్తిగా డైనమిక్ కాకపోయినా, వన్‌ప్లస్ ఆప్టిమైజేషన్ వల్ల యూజర్‌కు పెద్ద తేడా అనిపించకపోవచ్చు.

కెమెరా – డ్యుయల్ సెటప్

ఈ ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని మాత్రమే సమాచారం ఉంది. మెయిన్ సెన్సార్ ఎంత మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ లేదా టెలిఫోటోనా అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వన్‌ప్లస్ ఇమేజ్ ప్రాసెసింగ్ బలంగా ఉండడం వల్ల, కెమెరా క్వాలిటీ నార్డ్ సిరీస్ స్థాయిలో నమ్మకంగా ఉండే అవకాశం ఉంది.

ఇండియాలో ధర ఎంత ఉండొచ్చు

ఇప్పుడు అందరికీ ముఖ్యమైన ప్రశ్న ధర. ఈ ఫోన్‌ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15 సిరీస్ కంటే కింద ప్లేస్ అవుతుంది కాబట్టి, ధర కూడా కాస్త కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంది. రిపోర్టులు, మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఇండియాలో ఈ ఫోన్‌ ధర సుమారుగా రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండొచ్చని అంచనా. భారీ బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ క్లాస్ ప్రాసెసర్ ఈ ధరలో వస్తే, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఇది ఆప్షన్‌గా మారుతుంది. అధికారిక లాంచ్ డేట్, ఫైనల్ ధర బయటకు వస్తే కానీ పూర్తి స్పష్టత రాకపోయినా, వన్‌ప్లస్ అభిమానులకు ఇది ఖచ్చితంగా ఎదురుచూడాల్సిన ఫోన్‌గా మారుతోంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×