E-Paper
Advertisement

Tata Nexon EV: దేశీ మార్కెట్లో నెక్సాన్ ఈవీ దూకుడు, అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Tata Nexon EV:  దేశీ మార్కెట్లో నెక్సాన్ ఈవీ దూకుడు, అమ్మకాల్లో సరికొత్త రికార్డు!
Advertisement

భారతీయ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మంచి రేంజ్ తో పాటు అదిరిపోయే స్టైల్ తో క్రేజీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. టాటా ఈవీలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈవీల అమ్మకాల్లో టాటా సంస్థ సరికొత్త రికార్డును నెలకొల్పింది.  టాటా నెక్సాన్ EV దేశంలో 1,00,000 అమ్మకాలు దాటిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది. టాటా మోటార్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో TATA.ev డివిజన్ మొత్తం 2.5 లక్షల EVల అమ్మకాల మైలురాయిని దాటినట్లు చెప్పింది. దేశంలోని ఎలక్ట్రిక్ కార్లలలో టాటా కార్లు 66% మార్కెట్ షేర్‌ ను కలిగి ఉన్నట్లు వివరించింది.

లక్ష కార్లు అమ్ముడైన మోడల్ గా నెక్సాన్ EV గుర్తింపు

దేశీయ మార్కెట్ లో నెక్సాన్ EV 1 లక్ష యూనిట్ల అమ్మకాలు సాధించిన మొదటి మోడల్‌గా నిలిచింది. 2020లో లాంచ్ అయినప్పటి నుంచి భారత్‌ లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ SUVగా కొనసాగుతోంది. టాటా మొత్తం EVలు దేశంలో 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్‌ ను కలిగి ఉంటుంది. ఈ మైలురాయి భారత్‌ లో ఎలక్ట్రిక్ మొబిలిటీ మెయిన్‌ స్ట్రీమ్ అవుతున్నట్టు చూపిస్తోంది. ప్రస్తుతం 1,000 పట్టణాలు, నగరాల్లో టాటా EVలు ఉపయోగిస్తున్నారు. చాలా మంది యూజర్లు EVనే ప్రైమరీ వెహికిల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.

టాటా నెక్సాన్ EV స్పెసిఫికేషన్లు

Advertisement

టాటా నెక్సాన్ EV కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యధిక ఫీచర్లు, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 45 kWh, మీడియం రేంజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

⦿ బ్యాటరీ రేంజ్  

ఈ కారు బ్యాటరీ కెపాసిటీ 45 kWh లిథియం ఐయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మీడియం రేంజ్ వేరియంట్ 30 kWhగా ఉంటుంది. రేంజ్ 489 km వరకు ఇస్తుంది. మీడియం రేంజ్ 401 km పరిధిని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్(DC)తో 10-80% 18 నిమిషాల్లో పూర్తవుతుంది. 7.2 kW AC ఛార్జర్‌తో 6 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.

⦿ మోటార్,పెర్ఫార్మెన్స్

Advertisement

పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ AC మోటార్ తో వస్తుంది. 110 kW (లాంగ్ రేంజ్), 95 kW (మీడియం రేంజ్) పవర్ ను కలిగి ఉంటుంది. 215 Nm టార్క్ ను జెనరేట్ చేస్తుంది. 0-100 kmph 8.9 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ 140 kmph,  ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి.

ఫీచర్లు, సేఫ్టీ

ఇన్ఫోటైన్‌మెంట్ 31.24 cm సినిమాటిక్ టచ్‌ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 9 స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే సపోర్టింగ్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 26.03 cm HD ఫుల్లీ రీకాన్ఫిగరబుల్ డిజిటల్ డిస్‌ప్లే తో వస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, Arcade.ev ఇన్‌కార్ ఎంటర్‌టైన్‌మెంట్, 360° కెమెరా, ADAS లెవల్-2  ఉంటుందిజ  6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ అసిస్ట్, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ ఉంటాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో  5-స్టార్ రేటింగ్ ను కలిగి ఉంది. సీటింగ్ కెపాసిటీ 5 ఉంటుంది.

ధర (ఎక్స్-షోరూమ్)

ఈ కారు ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 15.99 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ ఆధారంగా ధర మారుతుంది.

Read Also: ఒడియమ్మ బంటీ.. కార్లపై ఆఫర్లే ఆఫర్లు, ఏకంగా రూ.10 లక్షల రాయితీ!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×