E-Paper
Advertisement

వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే 8000mAh బ్యాటరీ మొబైల్, ధర ఎంతంటే?

వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే 8000mAh బ్యాటరీ మొబైల్, ధర ఎంతంటే?
Advertisement

OnePlus N Series: భారత మార్కెట్లో ఇటీవల ‘వన్‌ప్లస్ N6’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వన్‌ప్లస్ సంస్థ.. ఇప్పుడు తమ బడ్జెట్ ఫ్రెండ్లీ N సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో త్వరలోనే మరో సరికొత్త మొబైల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక మైక్రోసైట్ లైవ్‌లోకి రావడంతో ఈ అంచనాలు నిజమౌతున్నాయి. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

త్వరలోనే సరికొత్త వన్‌ప్లస్ ఫోన్:

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అమెజాన్ టీజర్ ద్వారా ఈ సిరీస్‌లో కొత్త మొబైల్ వస్తున్నట్లు స్పష్టమైంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. దీనికి ‘వన్‌ప్లస్ N6x’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ప్రీమియం ధరలు పెట్టలేక, నమ్మకమైన పనితీరును ఆశించే యూజర్లను టార్గెట్ చేస్తూ వన్ ప్లస్ ఈ N సిరీస్ ఫోన్లను తీసుకువస్తోంది.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ కొత్త ఫోన్‌లో కూడా బ్యాటరీ లైఫ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల వచ్చిన వన్‌ప్లస్ N6 మోడల్ లాగే.. ఇందులోనూ ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే.. తరచూ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా గేమింగ్, స్ట్రీమింగ్, రోజువారీ పనులను యూజర్లు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చు.

Also Read: చూపు తిప్పుకోనివ్వని కలర్స్‌తో నుబియా AI ఫోన్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

వన్‌ప్లస్ N6 ఫీచర్లు:

Advertisement

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ N6 మోడల్ విషయానికి వస్తే.. ఇది 8000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. దీని ద్వారా ఇతర యాక్సెసరీలను ఛార్జ్ చేసుకునేందుకు 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ నార్మల్ యూసేజ్‌లో మూడు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16పై ఇది నడుస్తుంది.

ధర వివరాలు ఇలా:

వన్‌ప్లస్ N6 ఫోన్‌లో వెనుక వైపు 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP కెమెరాను, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. ప్రస్తుతం భారత మార్కెట్లో దీని బేస్ వేరియంట్ (4GB RAM + 128GB) ధర రూ.22,999గా ఉండగా, 6GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త ఫోన్ కూడా దాదాపు ఇదే తరహా ఫీచర్లు, రీజనబుల్ ధరతో బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!

Related News

ఐటెల్ జెనో సిరీస్ లాంచ్.. ల్యాప్‌టాప్, ఫోన్, ఇయర్‌బడ్స్.. అన్నింటికీ ఒకే పవర్ బ్యాంక్!

మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. డాల్బీ అట్మాస్‌తో శాంసంగ్ కొత్త స్పీకర్లు.. ధర ఎంతంటే?

సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

నీరు లేని టాయిలెట్.. కరెంట్ లేని హీటర్.. సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్లో ఎన్ని వింతలో!

చూపు తిప్పుకోనివ్వని కలర్స్‌తో నుబియా AI ఫోన్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

ఐఫోన్‌కు గట్టి పోటీగా గూగుల్ కొత్త స్కెచ్.. Pxel 11లో ఎవరూ ఊహించని సరికొత్త Glow ఫీచర్!

ఇప్పటివరకు చూసిన ఫోల్డబుల్ ఫోన్లు వేరు, ఇది వేరు.. శాంసంగ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

Big Stories

Advertisement
×