E-Paper
Advertisement

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి
Advertisement

Abdul Razzaq:  2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 World Cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో కొత్త తరహా ఫార్మాట్ కూడా అమలు చేసేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఈసారి సూపర్ 7 ను ఐసీసీ తెరపైకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ టీమిండియా ఓడించాలి

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq). 2009 సంవత్సరంలో టీమిండియాను చాంపియన్ ట్రోఫీ లో భాగంగా ఓడించామని.. 2027 లో కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ కొట్టే దెబ్బకు.. 150 కోట్ల భారతీయులు నోర్లు మూసుకోవాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మనం కొట్టే దెబ్బకు బీసీసీఐ కుదేలు కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

2009లో పాకిస్తాన్ చేతిలో ఓడిన టీమిండియా

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్ లు అయినా జరుగుతాయి. అదృష్టం బాగుంటే మూడు మ్యాచ్ లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడతాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఓడించడం అప్పట్లో చాలా సులభంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో టీమిండియా చాలా బలంగా తయారైందని వివరించారు. 2009 ఐసీసీ చాంపియన్ ట్రోఫీ సందర్భంగా దక్షిణాఫ్రికాలో టీమిండియాను చిత్తుగా ఓడించామని అబ్దుల్ రజాక్ గుర్తు చేశారు. ఆ సమయంలో 54 బరువులు తేడాతో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయిందన్నారు. తను కూడా పాకిస్తాన్ జట్టులో భాగమై… ఇండియన్ ఓడించినట్లు గుర్తు చేశారు.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

2027 వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించండి.. అబ్దుల్ రజాక్ పిలుపు

2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎక్కువ మ్యాచులు జరిగే అవకాశాలు ఉన్నాయని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండియాను ఓడించే శక్తిని సంపాదించాలని పిలుపునిచ్చారు. గంభీర్ కారణంగా టీమిండియా పరిస్థితి అతలాకుతలంగా తయారైందని బాంబు పేల్చారు. ఈ క్రమంలో టీమిండియాను దెబ్బ కొట్టి.. 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.

 

Related News

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?

జో రూట్ పెద్ద ఫులిష్ గాడు..99 ప‌రుగుల వ‌ద్ద నేనుంటే, సెంచ‌రీ చేసుకునేవాడు

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం

2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ ఔట్..19న లార్డ్స్ లో రిటైర్మెంట్?

Big Stories

Advertisement
×