E-Paper
Advertisement

చూపు తిప్పుకోనివ్వని కలర్స్‌తో నుబియా AI ఫోన్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

చూపు తిప్పుకోనివ్వని కలర్స్‌తో నుబియా AI ఫోన్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!
Advertisement

Nubia NaviX Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా తమ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC) 2026 వేదికగా ఈ ఫోన్‌ను పరిచయం చేయనున్నారు. ఈ తరుణంలో Nubia NaviX Ultra పేరుతో రాబోతున్న ఈ ఫోన్ డిజైన్, కలర్ వేరియంట్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఆకట్టుకునే రంగులు:

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులను ఆకట్టుకునేలా నాలుగు విభిన్న రంగుల్లో రూపొందించారు. ఇది బ్లాక్, పింక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో క్యాప్సూల్ ఆకారంలో కెమెరా ఐలాండ్ ఉంది. దీనికి కాస్త కిందగా ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో పంచ్-హోల్ డిజైన్‌ను అందించారు.

ప్రత్యేకమైన ఆరెంజ్ బటన్:

Advertisement

ఈ ఫోన్ డిజైన్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. దీనికి పక్కభాగంలో ఒక ప్రత్యేకమైన ఆరెంజ్ కలర్ బటన్‌ను ఇచ్చారు. దీని పనితీరుపై కంపెనీ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ.. ఈ బటన్ ద్వారా ఫోన్‌లోని ఏఐ ఫీచర్లను చాలా సులువుగా, వేగంగా యాక్సెస్ చేయవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: ఐఫోన్‌కు గట్టి పోటీగా గూగుల్ కొత్త స్కెచ్.. Pxel 11లో ఎవరూ ఊహించని సరికొత్త Glow ఫీచర్!

‘దౌబావో’ ఏఐ అసిస్టెంట్ సపోర్ట్:

Advertisement

ఈ ఫోన్ ప్రత్యేకంగా Doubao ఏఐ అసిస్టెంట్‌తో రానుంది. దీంతో ఫోన్ వాడకం మరింత సులభతరం కానుంది. వివిధ యాప్స్‌లో పనులను ఏఐ ద్వారా వేగంగా పూర్తి చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ అధునాతన ఫీచర్ల కారణంగానే లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ప్రతిష్టాత్మక WAIC 2026 సైల్ (SAIL) ఔట్‌స్టాండింగ్ ఏఐ లీడర్ అవార్డును కూడా గెలుచుకుంది.

ధర, స్పెసిఫికేషన్ల వివరాలు:

ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో చైనాలో విడుదలై.. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిన ‘నుబియా M153’ మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రానున్న ఈ నావిక్స్ అల్ట్రా ధర, ఇతర పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలు జులై 17 నుంచి 20 వరకు షాంఘైలో జరిగే సదస్సులో అధికారికంగా తెలియనున్నాయి.

Also Read: బియ్యం డబ్బా కథే మళ్లీ రిపీట్.. ఫోన్ ఓవర్ హీటైందని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? కంపెనీల సీరియస్ వార్నింగ్!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×