E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో 2.5 రోజులు బ్యాకప్ ఇచ్చే OnePlus N6x.. ధర ఎంత ఉండొచ్చంటే?

సింగిల్ ఛార్జ్‌తో 2.5 రోజులు బ్యాకప్ ఇచ్చే OnePlus N6x.. ధర ఎంత ఉండొచ్చంటే?
Advertisement

OnePlus N6x: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ అడుగుపెట్టబోతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న OnePlus N6x త్వరలోనే విడుదల కానుంది. గతంలో వచ్చిన N6 మోడల్ సక్సెస్ తర్వాత.. N సిరీస్‌లో వస్తున్న రెండో ఫోన్ ఇది. ఈ నెలాఖరున గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లతో మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

జులై 31న భారత్‌లో లాంచ్..

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ జులై 31న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ఈ ఫోన్ సేల్స్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా దీనిని బర్గుండి రెడ్, ఐస్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొస్తున్నారు.

Advertisement

Also Read: నోకియా లుమియా డిజైన్‌తో AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

7,000mAh భారీ బ్యాటరీ..

లాంచ్‌కు ముందే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 2.5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దాదాపు 20 గంటలకు పైగా వీడియోలు చూడవచ్చని, 25 గంటల పాటు సోషల్ మీడియా వాడుకోవచ్చని వెల్లడించింది.

ఆకట్టుకునే లుక్ అండ్ డిజైన్..

Advertisement

వన్‌ప్లస్ N6x డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, ప్రీమియమ్‌గా కనిపిస్తోంది. ఫోన్ వెనుక వైపు ఒక ప్రత్యేకమైన టెక్స్చర్, పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. మ్యూజిక్ ప్రేమికుల కోసం పైన 3.5mm ఆడియో జాక్ కూడా ఉంచడం విశేషం. మిగతా ఫీచర్లు, ధర వివరాలు లాంచ్ రోజే పూర్తిగా తెలియనున్నాయి.

Also Read: గూగుల్ పిక్సెల్ వాచ్ 5 లీక్.. భారీ RAM, అధునాతన AI ఫీచర్లతో రాబోతున్న కొత్త స్మార్ట్‌వాచ్!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×