E-Paper
Advertisement

అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు

అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు
Advertisement

Malayalam Dark Comedy: మలయాళం మేకర్స్ కొత్త కొత్త సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీయడంలో వీళ్ళ స్పెషాలిటీనే వేరు. మీరు కూడా మలయాళం సినిమాలు అంటే చెవి కోసుకుంటారా ? అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ క్రేజీ డార్క్ కామెడీ మీ కోసమే. అదే ‘ట్రిపుల్ డెక్కర్’ (Triple Decker) అనే సినిమా. 2026లోనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? దీని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో హీరో పేరు అఖిల్. అతను ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తాడు. అంటే రోజంతా బైక్ మీద తిరుగుతూ, వేడి వేడి ఫుడ్ పార్సిల్స్ డెలివరీ చేస్తూ బతుకుతాడు. అతని జీవితంలో ఉన్న ఏకైక సంతోషం తను ఎంతగానో ప్రేమించే అమ్మాయి. ఆ అమ్మాయి అంటే అతనికి పిచ్చి. ఎంత పిచ్చి అంటే… ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఇదిలా ఉండగా ఓరోజు ఆ అమ్మాయి ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోతుంది.

Advertisement

ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో అఖిల్ ఒక చిన్న రిస్క్ తీసుకుంటాడు. కానీ ఆ ఒక్క చిన్న తప్పు అతన్ని ఊహించని గందరగోళంలోకి నెట్టేస్తుంది. సాధారణ డెలివరీ బాయ్ రాత్రి వేళ ఒక భయంకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌లో చిక్కుకుపోతాడు. అక్కడ నుంచి సినిమా అసలైన రోలర్‌ కోస్టర్‌గా మారుతుంది. వరుస ట్విస్టులు, విచిత్రమైన క్యారెక్టర్లు, డార్క్ హ్యూమర్ ఉన్న సన్నివేశాలు… ఇలా ఆసక్తికరంగా సాగుతుంది.

నిజానికి హీరోని హీరోయిన్ తన తండ్రిని చంపమని అడుగుతుంది. హీరో కూడా అందుకు ఓకే అని కాలర్ ఎగరేసి మరీ, తన పరమాణు నిరూపించుకోవడానికి బయలుదేరతాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక బుర్ర పాడయ్యే నిజం ఒకటి తెలుస్తుంది అతనికి. కానీ అక్కడి నుంచి బయట పడలేని పరిస్థితిలో ఉంటారు. మరి ఇంతకీ హీరో ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయట పడ్డాడు ? హీరోయిన్ తండ్రి ఎవరు ? స్వయంగా కూతురే తండ్రిని చంపమని ఎందుకు అడిగింది ? క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

మలయాళ ఇండీ డార్క్ కామెడీ సినిమా ‘ట్రిపుల్ డెక్కర్’. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఉంటుంది. కృష్ణనుణ్ణి మంగళత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ శ్రీకుమారన్ , వైష్ణవి, గౌరీ కుట్టి, ఇంద్రన్స్ మెయిన్ లీడ్స్ గా నటించారు. 50 మందికి పైగా కొత్త ఆర్టిస్టులు ఇందులో నటించడం విశేషం. ఈ సినిమాను పూర్తిగా గెరిల్లా స్టైల్‌లో, ఐఫోన్లు – DSLR కెమెరాలతో, 50కి పైగా రియల్ లొకేషన్లలో షూట్ చేశారు. పెద్ద స్టూడియో సెటప్స్ లేకుండా, మామూలు మనుషుల జీవితాలను డార్క్ హ్యూమర్‌తో ముడిపెట్టి బాగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా ManoramaMAXలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి మలయాళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు.

Read Also: ప్రియుడిని బాయ్ ఫ్రెండ్ తో కలిసి… గుండె రాయిలా ఉంటేనే ఈ సినిమాను చూడండి

Related News

పాడుబడిన బావిలో పగతో రగిలిపోయే యువరాణి… తెలుగులో లేటెస్ట్ మలయాళం హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

OTT Apps banned:కేంద్రం కఠిన నిర్ణయం.. 50 ఓటీటీలు బ్యాన్!

అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. అక్కడే అసలు ట్విస్ట్!

బేస్మెంట్ లోని సొరంగంలోకి ఆత్మలను లాక్కెళ్ళే దుష్టశక్తి… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×