E-Paper
Advertisement

కోర్టు వీడియోలు వైరల్ చేస్తే.. అంతే సంగతులు.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

కోర్టు వీడియోలు వైరల్ చేస్తే.. అంతే సంగతులు.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!
Advertisement

Supreme Court: కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు సంబంధించి ఆడియో, వీడియో కంటెంట్ ను నెట్టింట పోస్ట్ చేయాలంటే.. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌ల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వస్తున్న కోర్టు దృశ్యాలు ఇటీవల పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఆ వీడియోలను ఎడిట్ చేస్తూ క్లిప్పింగ్‌లుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని జర్నలిస్ట్ హర్షితా గ్రోవర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్.. విచారణలోని కొన్ని భాగాలనే కట్ చేసి వైరల్ చేయడం వల్ల న్యాయ వ్యవస్థ ప్రజల ముందు నవ్వుల పాలు అవుతోందన్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం వాటిల్లుతోందని కోర్టుకు తెలియజేశారు.

Advertisement

న్యాయవాది వికాస్ సింగ్ వాదనతో ఏకీభవించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ‘కోర్టు విచారణల వీడియోల వినియోగంపై ఖచ్చితమైన నిబంధనలు, నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడ్డారు. ఏఐ టూల్స్ ఉపయోగించి న్యాయమూర్తులు, అడ్వకేట్ల వాయిస్ ను, పెదవుల కదలికలను మార్చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?

Advertisement

వారి వాదనతో ఏకీభవిస్తూ జస్టిల్ జోయ్ మాల్య బాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటాను కంట్రోల్ చేయడం అతిపెద్ద సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. కేసుల విచారణకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ను పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో న్యాయస్థానాలు 24 గంటలూ ప్రసారమయ్యే ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు కావని పేర్కొన్నారు. లైవ్ స్ట్రీమింగ్ వీడియోల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read: 1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్!

Related News

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×