E-Paper
Advertisement

OnePlus Turbo 6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్మురేపనున్న వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్.. 9000mAh బ్యాటరీతో పోటీకి సిద్ధం!

OnePlus Turbo 6: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్మురేపనున్న వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్.. 9000mAh బ్యాటరీతో పోటీకి సిద్ధం!
Advertisement

OnePlus Turbo 6: ప్రముఖ చైనా కంపెనీ తన వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. OnePlus Turbo 6, OnePlus Turbo 6V పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లో దించనుంది. అయితే కంపెనీ లాంచ్‌కు ముందే స్క్వేర్ ఆకారపు కెమెరాలతో కూడిన రెండు ఫీచర్ ఫోన్‌ల డిజైన్‌లను ఇప్పటికే పరిచయం చేసింది. వన్‌ప్లస్ టర్బో 6కు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌ను, వన్‌ప్లస్ టర్బో 6Vకు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoCను జోడించినట్లు తెలుస్తోంది.

విడుదల తేదీ:

OnePlus Turbo 6 సిరీస్ ఈనెల 8న చైనాలో విడుదల చేయనున్నట్లు తాజాగా వీబో పోస్ట్ తెలిపింది. అలాగే కంపెనీ విడుదల చేయనున్న వన్‌ప్లస్ ఫోన్‌ల డిజైన్, కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా ప్రత్యక్ష కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్ ఫోన్ల ఫొటోలను చూసిన యూజర్లు విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Also Read: ఒప్పో యూజర్లకు భారీ సర్‌ప్రైజ్.. మూడు కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేసిందోచ్!

కలర్ ఆప్షన్స్ ఇవే:

ఈ రెండు ఫోన్‌ల డిజైన్‌లు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తోంది. డ్యూయల్ కెమెరా సిస్టమ్, LED ఫ్లాష్‌తో కూడిన స్క్వేర్ షేప్ కెమెరా ప్యానెల్ OnePlus Turbo 6, OnePlus Turbo 6V వెనుక భాగంలో ఉంది. ఈ ఫోన్‌లు ఒకే రకమైన కలర్ ఎడ్జెస్, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంటాయని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే Turbo 6V బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో, Turbo 6 బ్లాక్, సిల్వర్, టర్కోయిస్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.

వన్‌ప్లస్ టర్బో 6 ఫీచర్లు:

Advertisement

తాజా నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో 6 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ భద్రత కోసం IP68 + IP69 + IP69K రేటింగ్‌లతో రానుంది. UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ , LPDDR5X RAMని కలిగి ఉన్న స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ఫోన్‌కు శక్తినిస్తుందని తెలుస్తోంది. అలాగే, ఇది Android 16పై పనిచేస్తుంది. అడ్రినో 825 GPUని కలిగి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

వన్‌ప్లస్ టర్బో 6 8-MP సెకండరీ లెన్స్, 50-MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండనుంది. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ భద్రత కోసం.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 9,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉన్న ఈ వన్‌ప్లస్ టర్బో 6.. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 80W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

వన్‌ప్లస్ టర్బో 6V స్పెసిఫికేషన్స్:

OnePlus Turbo 6తో పాటు OnePlus Turbo 6V గురించి కూడా కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకుంది. కొన్ని మినహాయింపులు తప్ప.. ఇది ప్రాథమిక టర్బో 6తో పోల్చదగిన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.8-అంగుళాల 1.5K OLED స్క్రీన్ ఉండనుంది.

Also Read: ఫుల్‌స్క్రీన్ డిజైన్‌తో షియోమీ మిక్స్ 5 ఎంట్రీ.. ఐఫోన్ 18 సిరీస్‌ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×