E-Paper
Advertisement

Garikapati -Naa Anveshana: అన్వేషణపై గరికపాటి ఫైర్ .. సమాజం చీధరించుకుంటుందంటూ!

Garikapati -Naa Anveshana: అన్వేషణపై గరికపాటి ఫైర్ .. సమాజం చీధరించుకుంటుందంటూ!
Advertisement

Garikapati -Na Anveshana:  నటుడు శివాజీ (Sivaji)చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంతోమంది ఆయనని విమర్శించారు. అయితే శివాజీని విమర్శించే క్రమంలో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ (Naa anveshana)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శివాజీకి కౌంటర్ ఇచ్చారు ఇంతటితో ఆగకుండా ఈయన ఈ వివాదంలోకి ప్రముఖ ప్రవచనకర్త  గరికపాటి నరసింహారావు(Garikapati Narasimharao)ను కూడా లాగారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈయన వీడియోలు చేశారు. ఈ విధంగా నా అన్వేషణ గరికపాటి గురించి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే నా అన్వేషణకు ఫాలోవర్స్ పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఆయనపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.

నేరస్తుడికి శిక్ష పడిన మారరు

నా అన్వేషణం గరికపాటి వీడియోల గురించి మాట్లాడటంతో గత రెండు రోజుల క్రితం గరికపాటి టీం ఈ విషయంపై స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేశారు. గురువు గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి ఆయన వీడియోలను తప్పుడు చర్యలకు ఉపయోగిస్తే కచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తాజాగా ఈ విషయంపై స్వయంగా గరికపాటి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ “ఒక నేరస్తుడికి 10 సంవత్సరాల పాటు శిక్ష పడిన ఆయనలో మార్పు వస్తుందో రాదో తెలియదు.. పదిమంది తనని చీధరించుకుంటే కచ్చితంగా 10 రోజులలో మారిపోతాడు. ప్రతి ఒక్కరికి చీదరించుకునే వ్యక్తిత్వం కూడా రావాలి ఇలాంటి వాళ్లు బయటకు వస్తే ఎందుకు వచ్చావు అని ప్రశ్నించే తత్వం ఉండాలని తెలిపారు.

వ్యక్తిత్వాలను ఖూనీ చేస్తున్నారు..

Advertisement

ఎలాంటి మచ్చలేని వారి పట్ల కూడా బురద చల్లుతున్నారు. వ్యక్తిత్వాలను కూడా ఖూనీ చేస్తుంటారు అయినప్పటికీ మనం సహిస్తూ ఉంటాము. మనకెందుకులే అంటూ చాలామంది మౌనం పాటిస్తూ ఉంటారు అయితే సందర్భం వచ్చింది కనుక నేను చెబుతున్నాను నా విషయంలో అభిమానులు ఎప్పుడూ ఎవరిని సహించలేదు, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెబుతున్నారు. శత్రువులు కూడా పారిపోతున్నారు సోషల్ మీడియా కామెంట్లలో కూడా మనదే పై చేయి.. అభిమానులు నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారు అంటూ పరోక్షంగా నా అన్వేషణ గురించి గరికపాటి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి గరికపాటి పేరు ప్రస్తావిస్తూ అన్వేషణ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి . ఏకంగా సీతాదేవి, ద్రౌపతి గురించి ఈయన తప్పుగా మాట్లాడటంతో అన్వేషణ తీరుపై మహిళా సంఘాలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు. ఇక ఇటీవల ఈయనపై కేసులు నమోదు కావడంతో పోలీసులు ఏకంగా ఇంస్టాగ్రామ్ కి కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం అన్వేషణ నోటి దూల కారణంగా పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు. అంతేకాకుండా ఈయనకు సుమారు పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు కూడా తగ్గిపోయారని తెలుస్తోంది.

Also Read: Actor Tommy Lee: అనుమానాస్పద స్థితిలో స్టార్ హీరో కూతురు మృ*తి

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×