E-Paper
Advertisement

ఇక వాట్సప్ లాగిన్‌కు OTP అవసరం లేదు.. హ్యాకర్లకు షాక్ ఇచ్చిన Vi కొత్త టెక్నాలజీ!

ఇక వాట్సప్ లాగిన్‌కు OTP అవసరం లేదు.. హ్యాకర్లకు షాక్ ఇచ్చిన Vi కొత్త టెక్నాలజీ!
Advertisement

Silent mobile Verification: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను లాగిన్ చేయాలంటే ప్రతిసారీ ఓటీపీ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం కాస్త విసుగు కలిగించే విషయమే. కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల వల్ల ఓటీపీలు రావడం కూడా ఆలస్యమవుతుంది. అయితే వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు ఇకపై ఈ తిప్పలు తప్పనున్నాయి. మెటాతో చేతులు కలిపిన Vi.. ‘సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్’ (SMV) అనే సరికొత్త సాంకేతికతను భారత్‌లో పరిచయం చేస్తోంది. దీంతో ఎలాంటి పాస్‌వర్డ్స్ లేదా ఓటీపీలు లేకుండానే నేరుగా లాగిన్ అయిపోవచ్చు.

సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ అంటే?

ఇది పూర్తిగా టెలికాం నెట్‌వర్క్ ఆధారంగా పనిచేసే ఒక సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్. మీరు మెటా యాప్స్‌లో లాగిన్ అయ్యేటప్పుడు కేవలం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి కోడ్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. Vi నెట్‌వర్క్ సిస్టమ్ నేరుగా ఆ యాప్‌తో కనెక్ట్ అయి, మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్ వివరాలను బ్యాక్‌గ్రౌండ్‌లో సరిచూస్తుంది. నెంబర్ మ్యాచ్ అయితే క్షణాల్లో లాగిన్ ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలు కలవకపోతే వెంటనే యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది.

అకౌంట్ రికవరీ మరింత వేగంగా..

Advertisement

ఈ సరికొత్త విధానం కేవలం లాగిన్‌కే కాకుండా కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడానికి, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ మార్చుకోవడానికి, ఒకవేళ అకౌంట్ లాక్ అయితే రికవరీ చేసుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదంతా నెట్‌వర్క్ ద్వారా చాలా సైలెంట్‌గా, వేగంగా జరిగిపోతుంది కాబట్టి.. యూజర్లకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు. అకౌంట్ సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియ కూడా చాలా సులువుగా మారుతుంది.

Also Read: రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

సైబర్ మోసాలకు చెక్:

Advertisement

సాధారణంగా వచ్చే ఓటీపీలను హ్యాకర్లు ఫిషింగ్, సిమ్ స్వాపింగ్ లేదా మాటల మార్పిడి ద్వారా దొంగిలించే ప్రమాదం ఉంది. కానీ ఈ కొత్త టెక్నాలజీలో యూజర్ ఎటువంటి కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి.. ఆన్‌లైన్ మోసగాళ్లకు మీ ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం అస్సలు దొరకదు. డిజిటల్ గుర్తింపు దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ నెట్‌వర్క్ లెవెల్ వెరిఫికేషన్ ఎంతగానో దోహదపడుతుంది.

భవిష్యత్తులో మరింత విస్తరణ:

ప్రస్తుతానికి ఈ సేవలను మెటా యాప్స్ అయిన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకే పరిమితం చేసినప్పటికీ.. Vi దీనిని ఇక్కడితో ఆపడం లేదు. భవిష్యత్తులో ఇతర ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు, యాప్స్‌కు కూడా ఈ సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఆన్‌లైన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, యూజర్లకు సురక్షితమైన, సులువైన లాగిన్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా Vi అడుగులు వేస్తోంది.

Also Read: యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×