E-Paper
Advertisement

OPPO A3x Launch Soon: 12 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అతి చౌక ధరలో ఒప్పో 5జీ ఫోన్..!

OPPO A3x Launch Soon: 12 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అతి చౌక ధరలో ఒప్పో 5జీ ఫోన్..!
Advertisement

OPPO A3x Launch Soon: టెక్ బ్రాండ్ OPPO తన లైనప్‌లో ఉన్న మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్ OPPO A3xని అతి త్వరలో రిలీజ్ చేయనుంది. అయితే దీనిని ప్రపంచ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. తాజాగా ఈ కొత్త Oppo ఫోన్ చైనా MIIT సర్టిఫికేషన్ సైట్‌లో గుర్తించబడింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మేరకు ఈ ఫోన్ ఫీచర్ల గురించి కూడా కొంత సమాచారం వెల్లడైంది.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఫోన్ 6 నుండి 12 GB RAM ప్యాక్ చేయగలదని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ డిస్‌ప్లే పరంగా కూడా బాగుంటుందని భావిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం.. ‘PKL110’ మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ MIIT సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఈ కొత్త ఫోన్ మిడ్ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉంది. OPPO A3x స్మార్ట్‌ఫోన్‌ 6 GB, 8 GB, 12 GB RAM ఆప్షన్లతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: ఐక్యూ నుంచి మరో సిరీస్.. లాంచ్ సమయం వెల్లడించిన కంపెనీ సీఈఓ..!

అలాగే OPPO A3x 5జీ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 1000 బ్రైట్‌నెస్ నిట్‌లు అందించినట్లు తెలుస్తోంది. OPPO A3x కలర్ వేరియంట్ల విషయానికొస్తే.. ఇది పర్పుల్, స్పార్కిల్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 45 వాట్ల ఛార్జింగ్‌ మద్దతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇటీవల ఈ ఫోన్ TUV రైన్‌ల్యాండ్, NBTC, FCC, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్లను పొందినట్లు తెలుస్తోంది.

Advertisement

దీని ధర, డిజైన్, స్పెసిఫికేషన్‌లు తాజాగా ఒక నివేదికలో వెల్లడయ్యాయి. రాబోయే Oppo స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌లో పని చేస్తుందని పేర్కొన్నారు. ఇది 5,100mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉన్నట్లు కూడా నివేదించబడింది. భారతదేశంలో OPPO A3x ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని సమాచారం.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×