BigTV English

Jupiter Transit: గురు గ్రహ సంచారం..120 రోజుల పాటు వీరికి కష్టాలు తప్పవు

Jupiter Transit: గురు గ్రహ సంచారం..120 రోజుల పాటు వీరికి కష్టాలు తప్పవు

Jupiter Transit: దేవ గురువు బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహం. ఈ గ్రహం జ్ఞానం, విద్య, శ్రేయస్సు, అదృష్టం, వివాహం, పిల్లలు, ఆధ్యాత్మికతను పాలించే గ్రహంగా చెబుతారు. గ్రహాల తిరోగమన స్థితి జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు. రాబోవు అక్టోబర్‌లో గురువు తిరోగమనం జరగనుంది. గురుగ్రహాన్ని సలహాదారుగా పరిగణిస్తారు. బృహస్పతి తిరోగమనం చేసే కొన్ని గ్రహాలలో ఒకటి. ఒక గ్రహం దాని సాధారణ మార్గం కాకుండా తిరోగమన దిశలో ఉన్నప్పుడు అది కొన్ని రాశులపై చెడు ప్రభావాలను అందిస్తుంది.
నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా బృహస్పతిని చెబుతుంటారు. 12 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది గురు గ్రహం. బృహస్పతి తన గమనంలో ప్రతి సంవత్సరం సుమారు 120 రోజుల పాటు తిరోగమనం చెందుతుంది. బృహస్పతి తిరోగమనం అక్టోబర్ 9, 2024 గురువారం మధ్యాహ్నం 12:33 గంటల నుంచి ఫిబ్రవరి 4, 2025 మంగళవారం మధ్యాహ్నం 3:09 గంటల వరకు 120 రోజుల పాటు ఉంటుంది. గురుడు 120 రోజుల పాటు తిరోగమనంలో కదలడం వల్ల ఈ పలు రాశులపై దీని ప్రభావం ఉంటుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి:
దేవ గురువు బృహస్పతి యొక్క తిరోగమన కదలిక వల్ల కొన్ని రాశుల వారికి అననుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మికంగా ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చికిత్సకు అధిక వ్యయం అవుతుంది. రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తిరిగి చెల్లించడం కూడా చాలా కష్టమవుతుంది. ఉద్యోగస్తుల పనిపై చాలా ప్రతికూల ప్రభావం చూపే అవకాశ: ఉంది. ప్రైవేటు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం పొందడంలో చాలా ఆలస్యం అవుతుంది. వ్యాపారంలో మరింత హెచ్చు తగ్గులుంటాయి .లాభాలను ఇది ప్రభావితం చేస్తుంది. కుటుంబ సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది.
సింహ రాశి:
బృహస్పతి యొక్క తిరోగమన కదలిక ద్వారా సింహ రాశి వారికి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. చిన్న లేదా దూర ప్రయాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈ సమయం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రేమ సంబంధాల విషయంలో కాస్త సీరియస్‌గా ఉండాలి. కేవలం వినోదంగా మాత్రం అస్సలు తీసుకోవద్దు.
తులా రాశి:
బృహస్పతి యొక్క తిరోగమన కదలిక వల్ల తులా రాశి వారి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విద్యార్థుల చదువుల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా కొందరు విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అమ్మకాలు తగ్గడం వల్ల వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉద్యోగార్థులు పని కోసం ఇంటి నుంచి బయటకు వస్తారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చేస్తున్న పని కూడా చెడిపోవచ్చు. వాహన ప్రయాణం మానుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు పెరగడం వల్ల కలహాలు వస్తాయి.


Also Read: బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి సంవత్సరం పాటు గొప్ప లాభాలు..

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి బృహస్పతి తిరోగమనం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు మీ తప్పుల గురించి మరింత ఆలోచించాలి. ధనస్సు రాశివారు తమ కుటుంబం ఎదగడానికి, పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సంబంధిత సమస్యలు వస్తాయి.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×