E-Paper
Advertisement

Kanguva First Single: ఫైర్ సాంగ్.. సూర్య నట విశ్వరూపం అదిరిపోయిందంతే

Kanguva First Single: ఫైర్ సాంగ్.. సూర్య నట విశ్వరూపం అదిరిపోయిందంతే
Advertisement

Kanguva First Single: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో సూర్యకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో అంతకుమించిన ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సూర్య ప్రతి సినిమాకు వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు.

తాజాగా సూర్య నటిస్తున్న చిత్రాల్లో కంగువ ఒకటి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక ఈరోజు సూర్య పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేసి సూర్యకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. ఆది జ్వాల.. అనంత జ్వాల అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైబల్ లుక్ లో సూర్య కనిపించాడు. ఫైర్ సాంగ్ అని చెప్పిన విధంగానే సాంగ్ మొత్తం ఫైర్ తో నింపేశారు.

యుద్ధవీరుడుగా సూర్య నట విశ్వరూపం చూపించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చాలా గ్యాప్ తరువాత సూర్యతో కలిసి పనిచేశాడు. శ్రీమణి రాసిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ తమ బేస్ వాయిస్ తో ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.

Advertisement

విజువల్స్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. మొదటి పాటతోనే సినిమాపై హైప్ ను తీసుకొచ్చాడు డైరెక్టర్ శివ. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×