E-Paper
Advertisement

OPPO A59 5G @ Rs 749: మాస్ ఆఫర్.. ఒక్క బిర్యాని ప్యాకెట్ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు భయ్యా!

OPPO A59 5G @ Rs 749: మాస్ ఆఫర్.. ఒక్క బిర్యాని ప్యాకెట్ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు భయ్యా!
Advertisement

OPPO A59 5G @ Rs 749: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ మొబైల్‌కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా తక్కువ ధరలో అదిరిపోయే మొబైళ్లను తీసుకువస్తున్నాయి.

Advertisement

రకరకాల మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఆ మోడళ్లలో రెండు మూడు వేరియంట్లను తీసుకొచ్చి ఆకట్టుకుంటున్నాయి. అయితే బ్రాండ్ బట్టి మొబైల్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఐఫోన్‌కు ఉన్న బ్రాండ్ బట్టి ఆ కంపెనీకి చెందిన ఫోన్లు లక్షల్లో ఉంటాయి.

ఆ తర్వాత మరికొన్ని మొబైల్స్ వేళల్లో ఉంటాయి. అయితే అలాంటి ఫోన్లను సామన్యులు కొనేందుకు ఇష్టపడరు. అందువల్ల అలాంటి వారిని అట్రాక్ట్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.

Advertisement

Read More: ఒక్క నెల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి

అయితే ఇప్పటికి ఎన్నో మోడళ్లు తక్కువ ధరలో మార్కెట్‌లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. అందులో ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్‌కి మార్కెట్‌‌లో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ రకరకాల మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

కాగా ఈ కంపెనీ ఇటీవల ఓ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఒప్పో ఏ59 5జీ (OPPO A59 5G) పేరుతో ఓ మొబైల్‌ను అందుబాటులో ఉంచింది. దీనిని రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. అందులో 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.18000లకు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే కొనుక్కోవచ్చు.

ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అలాగే 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.20వేలు ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,499కి సొంతం చేసుకోవచ్చు. అయితే వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

Read More: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ట్రాన్షక్షన్‌పై దాదాపు రూ.1399 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా స్పెషల్ ప్రైజ్ ప్రకారం.. క్యాష్‌బ్యాక్/కూపన్ డిస్కౌంట్‌లతో కలిపి అదనంగా రూ.4వేల తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఫోన్ లభిస్తుంది.

ఇవి కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 4/128జీబీ వేరియంట్ ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు దీనిపై రూ.13,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.749లకే సొంతం అవుతుంది. అయితే పాతఫోన్ కండీషన్, పెర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్ఛేంజ్ ధర మారుతూ ఉంటుంది. ఒకవేళ మొత్తం ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. ఈ 5జీ మొబైల్‌ను ఒక ప్యాకెట్ బిర్యానీ ధర కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. అందువల్ల మంచి 5జీ మొబైల్ కోసం ప్లాన్ చేస్తున్నవారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×