E-Paper
Advertisement

Nothing Phone 2a: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

Nothing Phone 2a: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు
Advertisement

Nothing Phone 2a: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ కంపెనీకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లు, ఇయర్ బడ్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా నథింగ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన నథింగ్ ఫోన్ (1), నథింగ్ ఫోన్ (2)కి అద్భుతమైన డిమాండ్ ఉంది. అయితే ఈ రెండు ఫోన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఇప్పుడ మరో ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

తాజాగా నథింగ్ ఫోన్ (2ఏ) పేరుతో మరో మొబైల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్, లుక్‌తో మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులోని ఫీచర్లు అదిరిపోయాయనే చెప్పాలి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. అలాగే 120 హెచ్‌జెడ్ అడాప్టిప్ రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చింది.

ధర:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్.. 8జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.23,999, రూ, 27,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ అయింది. ఈ ఫోన్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Read More: ఒక్క నెల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి

అయితే స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద మార్చి 12న కేవలం రూ.19,999లకే కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 30 Hz నుంచి 120Hz మధ్య ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆదారపడి పనిచేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆక్టాకోర్ 4 nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇందులో 12 జీబీ వరకు ర్యామ్‌ను అందించారు.

Read More: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..

అంతేకాకుండా ఫోన్ వెనుక భాగంలో రెండు 50 మెగా పిక్సెల్ కెమెరాలను అందించారు. అందులో ఒక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా. కాగా మరొ 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. కాగా ఇందులో 256 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను అందించారు. అంతేకాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×