E-Paper
Advertisement

Smartphone Comparison: ఓప్పో A6 vs నథింగ్ ఫోన్ 3a లైట్ vs ఐకూ Z10R.. ఏది కొనుగోలు చేయలి?

Smartphone Comparison: ఓప్పో A6 vs నథింగ్ ఫోన్ 3a లైట్ vs ఐకూ Z10R.. ఏది కొనుగోలు చేయలి?
Advertisement

Oppo A6 5G vs Nothing Phone 3a Lite 5G vs iQOO Z10R 5G Smartphone Comparison| ఇండియాలో ఇటీవలే ఓప్పో A6 5G లాంచ్ అయింది. ఈ ఫోన్‌తో బడ్జెట్ రేంజ్‌లో కొన్ని ఫోన్‌లు పోటీగా ఉన్నాయి. ముఖ్యంగా  నథింగ్ ఫోన్ 3a లైట్ 5G, iQOO Z10R 5Gతో ఈ ఫోన్ నేరుగా పోటీ పడుతోంది. మూడు ఫోన్లు మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు 5G, మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయి. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ లాంటి ఫీచర్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. ధర, ఫీచర్ల ఆధారంగా పోల్చుకొని మీరు ఏ ఫోన్ కొనుగోలు చేయాలో నిర్ణయించుకోండి.

ధరలు, స్టోరేజ్ ఆప్షన్లు

ఓప్పో A6 5G మూడు వేరియంట్లలో వస్తుంది.
4GB RAM + 128GB స్టోరేజ్ – రూ.17,999.
6GB RAM + 128GB స్టోరేజ్ – రూ.19,999.
6GB RAM + 256GB స్టోరేజ్ – రూ.21,999.

Advertisement

నథింగ్ ఫోన్ 3a లైట్ 5G రెండు వేరియంట్లలో ఉంది.
8GB RAM + 128GB స్టోరేజ్ – రూ.21,999.
8GB RAM + 256GB స్టోరేజ్ – రూ.23,999.

ఐకూ Z10R 5G కూడా రెండు ఆప్షన్లు ఇస్తోంది.
8GB RAM + 128GB స్టోరేజ్ – రూ.20,999.
8GB RAM + 256GB స్టోరేజ్ – రూ.22,999.

డిస్‌ప్లే సైజ్, రెజల్యూషన్

Advertisement

ఓప్పో A6 5Gలో 6.75 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. HD+ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 900 నిట్స్ వరకు ఉంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో 6.77 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రెజల్యూషన్, అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకు ఉంది.
ఐకూ Z10R 5Gలో 6.77 ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 1800 నిట్స్ వరకు ఉంది.

ప్రాసెసర్, పెర్ఫామెన్స్

ఓప్పో A6 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, బేసిక్ గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ఉంది.
మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో మెరుగైన పెర్ఫామెన్స్ ఇస్తుంది.
ఐకూ Z10R 5Gలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఉంది.
మూడు ఫోన్లలో ఇది అత్యధిక పెర్ఫామెన్స్ ఇస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్

ఓప్పో A6 5G ఆండ్రాయిడ్ 15తో కలర్‌ఓఎస్ 15లో వస్తుంది. ఫీచర్-రిచ్ ఇంటర్‌ఫేస్, కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఆండ్రాయిడ్ 15తో నథింగ్ ఓఎస్ 3.5లో వస్తుంది. క్లీన్, మినిమల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
iQOO Z10R 5G ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ ఓఎస్ 15లో వస్తుంది. పెర్ఫామెన్స్, గేమింగ్-ఫ్రెండ్లీ ఫీచర్లపై దృష్టి ఉంది.

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ

ఓప్పో A6 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు 8MP కెమెరా ఉంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ (EIS సపోర్ట్), 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో ఉన్నాయి. ముందు 16MP కెమెరా ఉంది.
ఐకూ Z10R 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ ఉన్నాయి. ముందు 32MP కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు

ఓప్పో A6 5Gలో డ్యూయల్ సిమ్, 5G సపోర్ట్ ఉంది. Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC ఉన్నాయి.
ఐకూ Z10R 5Gలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB టైప్-C 2.0 ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్

ఓప్పో A6 5Gలో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5Gలో 5000mAh బ్యాటరీ ఉంది. 33W వైర్డ్ ఛార్జింగ్ ఉంది.
ఐకూ Z10R 5Gలో 5700mAh బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

ఎది కొనుగోలు చేయాలి?

ఓప్పో A6 5G తక్కువ ధరలో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ప్రీమియం డిస్‌ప్లే, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఇస్తుంది.
ఐకూ Z10R 5G బెస్ట్ పెర్ఫామెన్స్, సెల్ఫీ కెమెరా ఇస్తుంది.
మీ అవసరాలు బట్టి (బ్యాటరీ, పెర్ఫామెన్స్ లేదా డిస్‌ప్లే) ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×