E-Paper
Advertisement

Oppo F27 5G: మైండ్ బ్లోయింగ్ గురూ.. ఒప్పో కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు లీక్.. AI ఫీచర్లు హైలైట్..!

Oppo F27 5G: మైండ్ బ్లోయింగ్ గురూ.. ఒప్పో కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు లీక్.. AI ఫీచర్లు హైలైట్..!
Advertisement

Oppo F27 5G Specifications Leaked: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో దేశీయ మార్కెట్‌లో హవా చూపిస్తోంది. తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికి దేశీయ మార్కెట్‌లో చాలా మోడళ్లను పరిచయం చేసింది. ఇక త్వరలో మరొక సరికొత్త మోడల్‌తో వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో కంపెనీ తన తదుపరి F-సిరీస్ హ్యాండ్‌సెట్‌గా Oppo F27 5G ఫోన్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది.

అయితే ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయినప్పటికీ Oppo F27 5G ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, ధరతో సహా ఇతర వివరాలు ఆన్‌లైన‌లో లీక్ అయ్యాయి. రాబోయే ఎఫ్-సిరీస్ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే Oppo F27 5G మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌లో రన్ అవుతుందని సమాచారం. హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌ను కలిగి ఉందని.. 5,000mAh బ్యాటరీతో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని తాజాగా లీక్ అయిన సమాచారం.

Advertisement

Oppo F27 5G Specifications

తాజాగా ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. వాటి ప్రకారం.. Oppo F27 5G ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14లో రన్ అవుతుందని తెలుస్తోంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,100 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇది MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8GB LPDDR4X RAM + 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో అందించబడుతుందని తెలుస్తోంది. Oppo F27 5G కెమెరా విషయానికొస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

Advertisement

Also Read: అదిరిపోయింది.. 50 ఎంపీ కెమెరా, 5100mAh బ్యాటరీ, బ్లాక్ బస్టర్ ప్రాసెసర్‌తో ఒప్పో కొత్త ఫోన్ లాంచ్..

ముందు భాగంలో ఇది 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెల్ఫీ షూటర్‌ను పొందే అవకాశం ఉంది. అలాగే AI స్టూడియో, AI ఎరేజర్ 2.0, AI స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి AI ఫీచర్లు ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. Oppo F27 5G ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

Oppo F27 5G Price

తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన ధర వివరాలు లీక్ అయ్యాయి. దాని ప్రకారం.. Oppo F27 5G భారతదేశంలో బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 8GB RAM + 256GB స్టోరేజీ కలిగిన టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉన్నట్లు సమాచారం. ఇది అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో విడుదల కాబోతోంది. కాగా Oppo F27 5G ఆగస్ట్ 18 నుండి సేల్‌కి అందుబాటులో ఉంటుందని సమాచారం. అదే సమయంలో Oppo తక్షణ క్యాష్‌బ్యాక్‌గా రూ.1800 అందిస్తుంది. అలాగే ఆరు నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపిక, వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×