BigTV English

Preity Zinta: పంజాబ్ కింగ్స్ యజమానుల మధ్య విభేదాలు.. ప్రీతి జింతా కోర్టు నోటీసులు

Preity Zinta: పంజాబ్ కింగ్స్ యజమానుల మధ్య విభేదాలు.. ప్రీతి జింతా కోర్టు నోటీసులు

Preity Zinta against Punjab Kings Co-owner(Sports news headlines): ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి మంచి పేరుంది. అందునా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, అందాల నటి ప్రీతిజింతా ఉండటంతో ఆ జట్టుకి ఒక కలరింగ్ వచ్చింది. అయితే ఇప్పడు ఆ ఫ్రాంచైజీ యజమానుల మధ్య విభేదాలు వచ్చాయి. ప్రతీజింతాతో పాటు ప్రధాన వాటాదారులుగా పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియా ఉన్నారు.


అయితే అందులో ఒకరైన మోహిత్ బర్మన్ తన షేర్లను అమ్మడానికి సిద్ధపడ్డాడు. అయితే వీటిని అడ్డుకోవాలని ప్రీతి జింతా చండీఘడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ అంశం నెట్టింట హీటెక్కించింది.

నిజానికి ఫ్రాంచైజీలకు ఒక కలరింగ్, ఒక గ్లామర్ తీసుకొచ్చింది ప్రీతి జింతా అని చెప్పాలి. పంజాబ్ కింగ్స్ కి తనవల్లనే ఒక బ్రాండ్ వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేటప్పుడు.. ఫ్రాంచైజీ అధినేతగా మ్యాచ్ లకి వచ్చి, తన అందచందాలు, హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఇప్పుడు తను చూపిన బాటనే అందరూ ఫాలో అవుతున్నారు.


షారూఖ్ ఖాన్, కావ్య మారన్ తదితరులు ఇప్పుడు మ్యాచ్ లకు వచ్చి హడావుడి చేస్తున్నారు. అదంతా ప్రీతి జింతా మార్క్ అని చెప్పాలి. అలాంటి ప్రీతి జింతా ఇటీవల  షేడ్ అవుట్ అయ్యింది. ఒకవైపు నుంచి జట్టు వైఫల్యాలు, రెండు ఇప్పుడు బయటకి వచ్చిన భాగస్వామ్యుల మధ్య విభేదాలతో చిరాకొచ్చి ఐపీఎల్ కి దూరంగానే ఉంటోంది. అంటే మ్యాచ్ లకి వచ్చినా, మునుపటంతటి జోష్ ఉండటం లేదు.

Also Read: ఆ రాత్రి ఏం జరిగిందంటే: వినేశ్ ఫోగట్ కోచ్

ఇలా ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు పార్టనర్స్ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసింది. అయితే ప్రీతిజింతా లీగల్ గా వెళ్లేసరికి.. తనపై ఆరోపణలు వచ్చిన మోహిత్ బర్మన్ వీటిని కొట్టి పారేశారు. తానెలాంటి షేర్లు అమ్మడం లేదని స్పష్టం చేశారు. ఇంత రచ్చ జరుగుతుంటే.. పంజాబ్ కింగ్స్ తరఫున ఉన్న అధికారిక ప్రతినిధులు ఎవరూ స్పందించ లేదు.

నిజానికి ప్రతీ జింతా ఎందుకు కోర్టుకు వెళ్లిందంటే.. కంపెనీ నిబంధనల ప్రకారం వాటాలను అమ్మేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తే, ముందు బయట వారికి కాకుండా, భాగస్వాములకు ఆఫర్ ఇవ్వాలి. అలా జరగకపోవడంతోనే ప్రీతి జింతా చట్టపరమైన చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ లో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×