E-Paper
Advertisement

Vastu tips in Telugu: కొంపదీసి ఈ వస్తువులను ఇంటి ముందు పెడుతున్నారా? కష్టాలకు వెల్‌కమ్ చెప్పినట్లే!

Vastu tips in Telugu: కొంపదీసి ఈ వస్తువులను ఇంటి ముందు పెడుతున్నారా? కష్టాలకు వెల్‌కమ్ చెప్పినట్లే!
Advertisement

Vastu tips in Telugu: వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటి ముందు కొన్ని వస్తువుల్ని ఉంచడం ఆ ఇంటి లాభనష్టాలపై కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని వస్తువులు ఇంటిలో ఆనందాన్ని పెంచుతాయి. విజయాన్నిస్తాయి. అయితే ఇంటి గుమ్మం వద్ద, గుమ్మానికి ఎదురుగా కొన్నివస్తువులను ఉంచరాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఆ వస్తువులు ఇంటి అభివృద్ధిని దెబ్బతీస్తాయట. ఆ వస్తువులేంటో చూద్దాం.

ఇంటి గుమ్మం, గుమ్మానికి ఎదురుగా ఉంచకూడని వస్తువులు

1. చనిపోయిన మొక్కలు

Advertisement

ఇంటిలోకి ప్రవేశించే ద్వారం వద్ద కలుపు మొక్కలు, చనిపోయిన మొక్కలను ఉంచడం అంత మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇవి ప్రతికూలశక్తిని సూచిస్తాయి. ఇంట్లోకి అదృష్టం, శ్రేయస్సు రాకుండా అడ్డుకుంటాయి. అందుకే ఆ మొక్కలను తీసివేసి.. పూల మొక్కలు వంటి వాటిని పెట్టుకోవడం మంచిది.

2. విరిగిన వస్తువులు

Advertisement

విరిగిన వస్తువులు లేదా.. సరిగ్గా పనిచేయని గడియారాలు వంటి వాటిని కూడా ఇంటి ఎదురుగా, ఇంటిలోపల ఉంచడం అంతమంచిది కాదు. ఇవి కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చేపట్టిన పనులు పూర్తికావు. ఆనందం ఉండదు. కష్టాలను చూస్తారు. ఇలాంటి వాటిని తొలగించడం వల్ల కూడా ఇంటిలో సానుకూల వాతావరణం ఉంటుంది.

Also Read: పేరు మార్చుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయా.. సక్సెస్ సాధ్యమేనా? ఆస్ట్రాలజీ ఏం చెబుతోంది?

3. పదునైన వస్తువులు

కత్తులు, కత్తెరలు వంటివాటితో పాటు పదునైన కోణాలు కలిగిన వస్తువులను కూడా ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచరాదు. ఇవి కూడా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అవాంఛనీయ సంఘటనలకు కారణమవుతాయి. వాటిని సురక్షితమైన ప్రదేశాలలో ఉంచాలి. అప్పుడే మీ ఇంటిల్లిపాది శాంతియుత వాతావరణంలో ఉంటారు.

4. ముదురు రంగుల్లో ఉండే వస్తువులు

ఇంటిలోకి ప్రవేశించే ద్వారం వద్ద నల్లని విగ్రహాలు, ముదురు రంగులతో కూడిన చాపలు వంటి వస్తువులను ఉంచకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఈ వస్తువులు సానుకూల శక్తిని హరించి, నిశ్చలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇంటిలో సానుకూలమైన వాతావరణం ఉండాలంటే.. లేతరంగులతో కూడిన వస్తువులను ఉంచాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కూడా ఇస్తుంది.

5. చెత్తబుట్ట

ఇంటికి ఎంట్రన్స్ లో చాలా మంది డస్ట్ బిన్ లు పెడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇవి ప్రతికూల శక్తుల్ని ఆకర్షిస్తాయి. అదృష్టం ఇంటిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. సానుకూలమైన, స్వాగతించే వాతావరణాన్ని పొందేందుకు వాటిని అక్కడి నుంచి తీసివేసి .. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వస్తువులను ఉంచాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×