E-Paper
Advertisement

Oppo Find X8 Pro Discount: ఒప్పో టాప్ మోడల్ ఫోన్‌పై.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోవద్దు!

Oppo Find X8 Pro Discount: ఒప్పో టాప్ మోడల్ ఫోన్‌పై.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోవద్దు!

Oppo Find X8 Pro Discount: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. ఇటీవల Find X9 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాగ్ షిప్ సిరీస్ లో Find X9, Find X9 Pro ఉన్నాయి. అయితే దీని ప్రీవియస్ మోడల్ అయిన Oppo Find X8 Proపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.19,000 తగ్గింపుతో ఈ ఫోన్ సేల్ కు వచ్చింది. పాత మోడల్ అయినప్పటికీ.. శక్తివంతమైన కెమెరా, సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్ తో Find X8 Pro ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తోంది.

Oppo Find X8 Pro మెుబైల్ భారత్ లో రూ.99,999 కు లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఇదే ఫోన్.. ఫ్లిప్ కార్డ్ లో రూ.84,999 లభిస్తోంది. దీనిపై రూ.15,000 డైరెక్ట్ డిస్కౌంట్ కాగా.. యాక్సిస్/ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి.. మరో రూ.4,000 వరకూ అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతేకాకుండా మీ పాత ఫోన్ ను రీప్లేస్ మెంట్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు.

Oppo Find X8 Pro ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 4,500 నిట్స్ బ్రైట్ నెస్, డాల్బీ విజన్ సౌండ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ మెుబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అలాగే 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,910mAh బ్యాటరీని ఈ ఫోన్ కు అమర్చారు.

Also Read: Meta Oakley AI glasses: మెటా నుంచి నయా స్మార్ట్ గ్లాసెస్.. ధర ఏకంగా రూ.52,300.. ఎందుకంత స్పెషల్?

ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ (నాలుగు) కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT808 ప్రైమరీ కెమెరా కాగా.. 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP Sony LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్‌తో 50MP Sony IMX858 సెన్సార్, 120x డిజిటల్ జూమ్‌తో 50MP Samsung అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Find X8 Pro ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా సైతం ఉంది. ఈ ఫోన్ కు కెమెరానే ప్రధాన బలంగా చెప్పవచ్చు.

Also Read: Oppo Reno 14: ఓప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.6000 ధర తగ్గింపు.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×