E-Paper
Advertisement

7,050mAh బ్యాటరీ, హాసెల్‌బ్లాడ్ కెమెరా.. వావ్ అనిపించేలా Oppo Find X9 Ultra లుక్స్!

7,050mAh బ్యాటరీ, హాసెల్‌బ్లాడ్ కెమెరా.. వావ్ అనిపించేలా Oppo Find X9 Ultra లుక్స్!
Advertisement

Oppo Find X9 Ultra: ఒప్పో కంపెనీ తమ మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Oppo Find X9 Ultraను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. Find X9 సిరీస్‌లో టాప్ ఎండ్ మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్‌తో పాటు Find X9s మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Find X9, Find X9 Pro మోడళ్లకు అదనంగా ఈ కొత్త Ultra ఫోన్ తోడైంది. అదిరిపోయే కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ధర వివరాలు..

భారత్‌లో Oppo Find X9 Ultra ఒకే ఒక్క వేరియంట్‌లో లభిస్తుంది. 12GB RAM, 512GB స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను కంపెనీ రూ.1,69,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ క్యాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా దీన్ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మే 14 నుండి మే 27 లోపు ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి రూ.11,000 విలువైన ప్రీమియం గిఫ్ట్ బాక్స్ ఉచితంగా లభిస్తుంది. దీనిలో Oppo Enco Air 5 Pro ఇయర్‌బడ్స్‌తో పాటు అల్ట్రా కవర్ కేస్ ఉంటాయి.

ఆకర్షణీయమైన ఆఫర్లు..

Advertisement

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.22,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ప్రముఖ బ్యాంక్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వీటితో పాటు 60 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూ, 180 రోజుల హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. గూగుల్ ఏఐ ప్రోతో పాటు 5TB క్లౌడ్ స్టోరేజ్ మూడు నెలల పాటు, స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తున్నారు. జియో వినియోగదారులకు 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు రూ.15,000 విలువైన గూగుల్ జెమిని బెనిఫిట్స్ కూడా అందుతాయి.

Also Read: బ్యాంక్ అకౌంట్‌తో పనిలేదిక.. టీనేజర్స్ కోసం టాప్-8 సూపర్ డిజిటల్ పాకెట్ మనీ యాప్స్ ఇవే!

అద్భుతమైన ప్రాసెసర్..

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 పై పనిచేస్తుంది. దీనిలో 6.82 అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 16GB RAM తోడైంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అమర్చారు.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఈ ఫోన్ ప్రత్యేకత దీని కెమెరా అనే చెప్పాలి. హాసెల్‌బ్లాడ్ భాగస్వామ్యంతో డెవలప్ చేసిన నాలుగు రియర్ కెమెరాల సెటప్ ఇందులో ఉంది. ఇది 8K వీడియో రికార్డింగ్ మరియు డాల్బీ విజన్ క్యాప్చర్‌ను సపోర్ట్ చేస్తుంది. హాసెల్‌బ్లాడ్ ఇమేజింగ్, ఎక్స్‌ప్యాన్ వంటి ప్రత్యేక మోడ్‌లు ఫొటోగ్రఫీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. ఇక పవర్ విషయానికి వస్తే.. దీనిలో భారీ 7,050mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 235 గ్రాములు ఉంటుంది.

Also Read: వాట్సప్‌లో క్రేజీ ప్రైవసీ ఫీచర్.. ఇక మెసేజ్ చదవగానే మాయం!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×