Kohli VS Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య ఉప్పల్ వేదికగా (Rajiv Gandhi International Stadium, Hyderabad) నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు ను చిత్తుగా ఓడించింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే మ్యాచ్ జరుగుతుండగానే విరాట్ కోహ్లీ (virat kohli ), ట్రావిస్ హెడ్ (travis head) మధ్య మాటలు యుద్ధం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే దమ్ముంటే నువ్వు బౌలింగ్ చెయ్.. ఇరగదీస్తామని హెడ్ కు వార్నింగ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
ఏదో సైగలు చేసి విరాట్ కోహ్లీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ట్రావిస్ హెడ్ కూడా చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇక మ్యాచ్ అయిన తర్వాత హెడ్ కు షేక్ హ్యాండ్ (No Handshake) ఇవ్వకుండా విరాట్ కోహ్లీ ఘోరంగా అవమానించాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు హెడ్ ముందరకు వచ్చినా, విరాట్ కోహ్లీ మాత్రం అగ్రెసివ్ గా వ్యవహరించారు. మిగిలిన ప్లేయర్లు అందరి ముందు హెడ్ ను అవమానించారు. ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో కోహ్లీని టార్గెట్ చేస్తూ మాజీ క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారు.
ట్రావిస్ హెడ్ ను అవమానించిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ గా పేరు ఉన్న విరాట్ కోహ్లీ.. ప్రత్యర్ధుల మధ్య ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. వెంటనే హెడ్ కు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ క్రికెటర్లకు హగ్గులు ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ట్రావిస్ హెడ్ కు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సీరియస్ అవుతున్నారు. 2021 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది.
ఆ సమయంలో మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) అలాగే బాబర్ ఆజం ( Babar Azam) ఇద్దరూ మ్యాచ్ గెలిపించారు. ఒక్క వికెట్ పడకుండా ఇండియాను చిత్తు చేశారు. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా మన ప్రత్యర్థి పాకిస్తాన్ ఒకప్పటి ఓపెనర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ హగ్గులు ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక్కడ ఐపిఎల్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ కు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తప్పు విరాట్ కోహ్లీ దగ్గర ఉన్నా కూడా… తన బలుపు చూపించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరును బయట పెడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. విరాట్ కోహ్లీకి మిత్రుడు కంటే శత్రువే ఎక్కువైందని ఆగ్రహిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
Kohli didn't shake hands with Travis Head.
This same guy hugged Babar and Rizwan after losing by 10 wkts vs Pak in 2021 T20WC.🥲 pic.twitter.com/KuA7ALeIQl
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) May 22, 2026