Harbhajan Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన హైదరాబాద్… బెంగళూరు పైన 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ (Virat Kohli ), ట్రావిస్ హెడ్ (Travis head) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రావిస్ హెడ్ వస్తే… విరాట్ కోహ్లీ నిరాకరించాడు. SRH ప్లేయర్లు చూస్తుండగానే ట్రావిస్ హెడ్ ను అవమానించాడు కోహ్లీ. ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనిపై విరాట్ కోహ్లీని దోషిగా చిత్రీకరిస్తూ.. మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా, విరాట్ కోహ్లీ బలుపు చూపించాడని మండిపడుతున్నారు. ఒక వరల్డ్ క్లాస్ ఆటగాడైన కోహ్లీకి ఇంత పొగరు ఉండకూడదని చురకలు అంటిస్తున్నారు.
సన్ రైజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head) షేక్ హ్యాండ్ ( Shake Hand) విషయంలో విరాట్ కోహ్లీని అందరూ విలన్ చేసి విమర్శలు చేస్తుంటే.. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మాత్రం అతన్ని వెనుకేసుకు వచ్చాడు. హెడ్ విషయంలో విరాట్ కోహ్లీ తప్పిదం ఏమీ లేదని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ సైలెంట్ గా విరాట్ కోహ్లీని గట్టిగానే గెలికి ఉంటాడని… అందుకే ఈ షేక్ హ్యాండ్ వివాదం చోటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సాధారణంగా విరాట్ కోహ్లీ అందరితో కలిసిమెలిసి ఉంటాడని వ్యాఖ్యానించారు. కచ్చితంగా ప్రత్యర్ధులకు షేక్ హ్యాండ్ ఇస్తాడని వివరించారు.
అయితే కెమెరా వెనకాల విరాట్ కోహ్లీని ఉద్దేశించి ట్రావిస్ హెడ్, అనరాని మాటలు అని ఉండవచ్చని.. అందుకే కోహ్లీకి మండిపోయిందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇండియన్ క్రికెటర్లను హెడ్ విమర్శించిన సంగతి గుర్తు చేశారు హర్భజన్. అసలు విషయాలు తెలుసుకోకుండా విరాట్ కోహ్లీని దూషించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో ట్రావిస్ హెడ్ లాంటి వెధవలకు అలా జరగాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. అదే సమయంలో ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan) కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్ని గొడవలు జరిగిన మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిందేనని తెలిపారు. ఇక పైన ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఇరు జట్ల కెప్టెన్లు చూసుకోవాలని వివరించారు.
Harbhajan singh on (cricbuzz) over Kohli – Head handshake drama 🎙:
I have known Virat Kohli for a very very long time now and I can say this with full confidence from the bottom of my heart that this guy is absolutely the last person on earth who would ever refuse to shake… pic.twitter.com/XfHXqkhZl6
— Aadi (@Gitekimhit) May 23, 2026