OPPO K14 5G Sale: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఒప్పో తమ సరికొత్త ‘Oppo K14 5G’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్, ప్రిజం వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఇప్పుడీ ఫోన్ ప్రారంభ ధర, ఫీచర్లు, బ్యాంక్ ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
ఈ Oppo K14 5G ధర విషయానికి వస్తే.. మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ధర రూ.17,999 కాగా, 6GB RAM + 256GB వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 8GB RAM + 256GB మోడల్‌ను రూ.21,999కు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభ సేల్ ఆఫర్ కింద SBI, HDFC, లేదా ICICI బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్‌ను కేవలం రూ.16,999కే పొందే అవకాశం ఉంది. అదనంగా, 3 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
Also Read: 8000mah భారీ బ్యాటరీ, 200MP కెమెరాతో ఐఫోన్‌కు గట్టి పోటీ.. ‘హానర్ మ్యాజిక్ 9’ ఫీచర్లు లీక్!
ఈ ఫోన్ మెయిన్ అట్రాక్షన్.. దీని 7000mAh భారీ బ్యాటరీ. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు రెండ్రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి తోడు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, కేవలం 30 నిమిషాల్లోనే సుమారు 37% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర చిన్న గ్యాడ్జెట్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై పనిచేసే ఈ ఫోన్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత ColorOSపై రన్ అవుతుంది. ఇక ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP AI మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉండగా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. AI ఎరేజర్ 2.0, AI క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి ఫీచర్లు ఫొటోలను ప్రో లెవల్‌లో తీర్చిదిద్దుతాయి. అలాగే IP69 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుండి రక్షణ లభిస్తుంది.
Also Read: 9000mAh బ్యాటరీతో పోకో X8 ప్రో సిరీస్ లాంచ్.. ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే మస్తుంది భయ్యా!