E-Paper
Advertisement

Honor Magic 9 Series: 8000mah భారీ బ్యాటరీ, 200MP కెమెరాతో ఐఫోన్‌కు గట్టి పోటీ.. ‘హానర్ మ్యాజిక్ 9’ ఫీచర్లు లీక్!

Honor Magic 9 Series: 8000mah భారీ బ్యాటరీ, 200MP కెమెరాతో ఐఫోన్‌కు గట్టి పోటీ.. ‘హానర్ మ్యాజిక్ 9’ ఫీచర్లు లీక్!
Advertisement

Honor Magic 9 Series: ప్రముఖ చైనా సంస్థ Honor త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లోకి తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్ Honor Magic 9ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చిన్న సైజు ఫోన్‌లను ఇష్టపడే వారికి, పవర్‌ఫుల్ ఫీచర్లను కోరుకునే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ హానర్ మ్యాజిక్ 9 సిరీస్ గురించి కొన్ని ఫీచర్లు తాజాగా లీక్ అయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

కాంపాక్ట్ డిజైన్:

గతేడాది విడుదలైన Honor Magic 8 తో పోలిస్తే, Magic 9 మరింత కాంపాక్ట్‌గా రానుంది. దీనిలో 6.3 అంగుళాల OLED LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను ఉపయోగించబోతున్నారు. ఇది చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఇక భద్రత కోసం ఈ ఫోన్‌లో వేగవంతమైన అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చనున్నారు.

Advertisement

Also Read: సోలార్‌తో ఇండక్షన్ స్టవ్ నడపాలంటే ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా?

భారీ బ్యాటరీ సామర్థ్యం:

సాధారణంగా చిన్న ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ హానర్ ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని వాడుతూ, దాదాపు 7,500mAh నుండి 8,000mAh వరకు భారీ బ్యాటరీని ఈ చిన్న ఫోన్‌లో సెట్ చేయబోతున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, సింగిల్ ఛార్జ్‌తో రెండు రోజుల వరకు నిరంతరాయంగా వాడుకోవచ్చు.

200 మెగాపిక్సల్ కెమెరా:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 50MP అల్ట్రా‌వైడ్, 64MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌ను అందించనున్నారు. ఇది దూరంగా ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా క్లిక్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. అలాగే సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించబోతున్నారని సమాచారం.

అందుబాటులోకి ఎప్పుడంటే?

ఈ ఫోన్ క్వాల్కమ్ నుంచి రాబోయే అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite (Gen 4/5) ప్రాసెసర్‌తో రన్ అయ్యే అవకాశం ఉంది. 2nm లేదా 3nm టెక్నాలజీతో తయారయ్యే ఈ చిప్‌సెట్ వల్ల ఫోన్ స్పీడ్ పెరగడమే కాకుండా, బ్యాటరీ ఆదా కూడా మెరుగ్గా ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!

Related News

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

Big Stories

Advertisement
×