E-Paper
Advertisement

Oppo K15 స్పెసిఫికేషన్స్ లీక్.. అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న క్రేజీ స్మార్ట్‌‌ఫోన్!

Oppo K15 స్పెసిఫికేషన్స్ లీక్.. అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న క్రేజీ స్మార్ట్‌‌ఫోన్!
Advertisement

Oppo K15: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. తమ మిడ్‌రేంజ్ K సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా మార్కెట్లో Oppo K15 Pro, Oppo K15 Pro Plus మోడల్స్ అందుబాటులోకి రాగా.. ఇప్పుడు బేస్ వేరియంట్ అయిన Oppo K15 త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో, దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలు:

సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది యూజర్లకు మెరుగైన కలర్ డెప్త్, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. అలాగే దీనిలో 2.5GHz క్లాక్ స్పీడ్‌ను అందించే ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఫోన్ 8GB, 12GB RAM ఆప్షన్లతో పాటు 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త పెయిడ్ ప్లాన్.. ఉచితంగా వాడేవారి పరిస్థితి ఏంటి బాబోయ్?

మూడు 50 మెగాపిక్సల్ కెమెరాలు:

ఫొటోగ్రఫీ పరంగా Oppo K15 అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. దీనిలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, మరో 50MP సెకండరీ కెమెరాను ఇస్తున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించడం విశేషం.

భారీ బ్యాటరీ.. గట్టి సెక్యూరిటీ:

Advertisement

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,755mAh బ్యాటరీ సామర్థ్యమే. అయితే కంపెనీ దీనిని 8,000mAh బ్యాటరీగా ప్రమోట్ చేయనుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దాదాపు 205 గ్రాముల బరువుండే ఈ Oppo K15.. ఈ సిరీస్‌లోని Pro Plus మోడల్‌ తరహాలోనే పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌ను యూజర్లకు అందించనుంది.

Also Read: పవర్ బ్యాంక్ కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన 5 ఫీచర్లు.. కెపాసిటీ ఒక్కటే సరిపోదు!

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×