E-Paper
Advertisement

ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? కంప్రెసర్ పేలిపోతుంది జాగ్రత్త !

ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? కంప్రెసర్ పేలిపోతుంది జాగ్రత్త !
Advertisement

Refrigerator ice buildup causes: మనం ఇంట్లో వాడే ఫ్రిజ్‌లోని ఫ్రీజర్ భాగంలో ఐస్ గడ్డకట్టడం చాలా కామన్. కానీ.. కొన్నిసార్లు అది హద్దులు దాటి.. కొండలా పేరుకుపోతుంటుంది. అసలు ఫ్రిజ్‌లో ఇలా అవసరానికి మించి ఐస్ గడ్డకట్టడం వల్ల కూలింగ్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఇలా ఐస్ కొండలు పేరుకుపోవడం వల్ల మీ ఫ్రిజ్ లైఫ్ సగానికి సగం తగ్గిపోతుందని మీకు తెలుసా? దీని వల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాదు, ఫ్రిజ్ త్వరగా పాడయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ ఐస్ బ్లాక్స్ సమస్యకు కారణాలు ఏంటి? ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి వంటి విషయాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్‌లో ఎక్కువ ఐస్ పేరుకుపోవడం వల్ల వచ్చే నష్టాలు:

1. కంప్రెసర్‌పై భారం:
ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా పేరుకుపోయినప్పుడు.. అది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. అంటే.. లోపల ఉండాల్సిన అసలైన కూలింగ్‌ను అది బయటకు రానివ్వదు. దీని వల్ల ఫ్రిజ్ లోపల టెంపరేచర్‌ను మెయింటెన్ చేయడానికి కంప్రెసర్ 24 గంటలూ నాన్‌స్టాప్‌గా రన్ అవ్వాల్సి వస్తుంది. ఇలా కంప్రెసర్‌పై విపరీతమైన లోడ్ పడటం వల్ల అది హీట్ ఎక్కి, చాలా త్వరగా పాడైపోతుంది.

Advertisement

2. కరెంట్ బిల్లు మోత :
ఫ్రిజ్ కంప్రెసర్ ఎంత ఎక్కువ సేపు రన్ అయితే.. అంత ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డలు ఉన్నప్పుడు మీ నార్మల్ కరెంట్ బిల్లు కంటే కనీసం 20% నుంచి 30% వరకు బిల్లు పెరిగే అవకాశం ఉంది.

3. ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్:
ఎక్కువగా ఐస్ పేరుకుపోవడం వల్ల ఫ్రిజ్ లోపల ఉండే థర్మోస్టాట్, ఫ్యాన్ మోటార్, కాయిల్స్ దెబ్బతింటాయి. కొన్ని సార్లు ఐస్ ప్రెజర్‌కు ఫ్రీజర్ డోర్ లేదా లోపల ఉండే ప్లాస్టిక్ షెల్ఫ్‌లు కూడా విరిగిపోయే ప్రమాదం ఉంది.

Advertisement

ఎక్కువ ఐస్ గడ్డకట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీ ఫ్రిజ్ లైఫ్ పెరగాలన్నా, కరెంట్ బిల్లు తగ్గాలన్నా ఈ సింపుల్ హ్యాక్స్ ఫాలో అవ్వండి.

రెగ్యులర్ డీఫ్రాస్ట్: మీది సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే.. వారానికి కనీసం ఒక్కసారైనా ‘Defrost’ బటన్ నొక్కడం అలవాటు చేసుకోండి. ఐస్ మొత్తం కరిగిపోయాక ఫ్రిజ్ మళ్లీ నార్మల్‌గా పనిచేస్తుంది.

డోర్ గాస్కెట్ చెక్ చేయండి: ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ లూజ్ అయినా లేదా పాడైనా బయట ఉండే వేడి గాలి, తేమ లోపలికి వెళ్తాయి. ఆ తేమ వల్లే ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా గడ్డకడుతుంది. కాబట్టి రబ్బర్ పాడైతే వెంటనే మార్చండి.

Also Read: డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం

టెంపరేచర్ సెట్టింగ్స్: వాతావరణాన్ని బట్టి ఫ్రిజ్ థర్మోస్టాట్ నంబర్‌ను అడ్జస్ట్ చేయాలి. ఎండాకాలంలో మీడియం లేదా హై పెట్టినా, వర్షాకాలం, చలికాలంలో మాత్రం లో-సెట్టింగ్స్ (1 లేదా 2) లో ఉంచడం మంచిది.

వేడి వస్తువులు పెట్టకండి: పాలు, అన్నం లేదా కూరలను వేడిగా ఉన్నప్పుడే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లోపల వేడి ఆవిర్లు ఎక్కువై ఐస్ కొండల్లా పేరుకుపోతుంది. వస్తువులు పూర్తిగా చల్లారాకే లోపల పెట్టాలి.

ఫ్రిజ్‌ను గోడకు అంటించి పెట్టొద్దు: రిఫ్రిజిరేటర్ వెనుక వైపు గాలి ఆడటానికి కనీసం 6 ఇంచుల గ్యాప్ ఉండాలి. అప్పుడే కంప్రెసర్ వేడి బయటకు పోయి ఫ్రిజ్ సేఫ్‌గా ఉంటుంది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫ్రిజ్ అస్సలు పాడవదు.. కొత్తదానిలా మెరిసిపోతూ సూపర్ కూలింగ్ ఇస్తుంది.

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×