E-Paper
Advertisement

యాపిల్‌కు చెక్ పెట్టేలా ఒప్పో కొత్త ప్లాన్.. వామ్మో, ఈ Mini Padలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లా!

యాపిల్‌కు చెక్ పెట్టేలా ఒప్పో కొత్త ప్లాన్.. వామ్మో, ఈ Mini Padలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లా!
Advertisement

Oppo Pad Mini: టెక్ మార్కెట్‌లో యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీల తర్వాత ఇతర బ్రాండ్లకు గట్టిపోటీ ఇచ్చే బ్రాండ్ ఏదైనా ఉందంటే.. అది ఒప్పో అని చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో ఒప్పో నుంచి రాబోతున్న ఈ కొత్త ట్యాబ్లెట్ ‘Oppo Pad Mini’ గురించే చర్చ నడుస్తోంది. ఈ నెల 21న చైనాలో జరగబోయే ఈవెంట్‌లో దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ఈ బుజ్జి ట్యాబ్ గీక్‌బెంచ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమై టెక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. దీని పెర్ఫార్మెన్స్ వివరాలు చూస్తుంటే గేమ్ లవర్స్‌కు పూనకాలు రావడం పక్కా అనిపిస్తోంది.

స్పీడ్ అంటే ఇలా ఉండాలి..

సాధారణంగా చిన్న సైజు ట్యాబ్లెట్స్ పెర్ఫార్మెన్స్‌లో కాస్త స్లోగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ ఒప్పో ప్యాడ్ మినీ విషయంలో సీన్ రివర్స్. దీనిలో అత్యంత శక్తివంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5’ ప్రాసెసర్‌ను వాడుతున్నట్లు సమాచారం. గీక్‌బెంచ్ టెస్టుల్లో ఇది సాధించిన స్కోర్లు చూస్తుంటే.. హెవీ గేమింగ్ అయినా, మల్టీ టాస్కింగ్ అయినా అస్సలు తగ్గనంటోంది. దీనికి తోడు 12GB భారీ RAM కూడా తోడవ్వడంతో, యాప్స్ ఓపెన్ చేయడం నుంచి వాడటం వరకు ఎక్కడా ల్యాగ్ అనే మాటే వినిపించదు.

Advertisement

Also Read: వావ్, ఇది కదా ఆఫర్ అంటే.. ఏసీలపై రూ.20,000 డిస్కౌంట్, రూ.30,000 క్యాష్‌బ్యాక్!

లుక్ పరంగా అదుర్స్..

ఈ ట్యాబ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాదు.. కేవలం 5.39 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. అలాగే దీనిలో 8.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. దీంతో మూవీ చూసినా, గేమ్స్ ఆడినా విజువల్స్ అదిరిపోయేలా ఉంటాయి. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. 8,000mAh పెద్ద బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చన్నమాట.

అన్నీ ఒకేసారి..

Advertisement

ఒప్పో కేవలం ఈ ట్యాబ్‌ను మాత్రమే కాదు.. ఏప్రిల్ 21న జరిగే వేడుకలో ప్యాడ్ మినీతో పాటు ఒప్పో ప్యాడ్ 5 ప్రో, కొత్త ఫైండ్ X9 సిరీస్ ఫోన్లు, కొత్త వాచ్, ఇయర్‌బడ్స్ లాంటి బోలెడు గ్యాడ్జెట్లను ఒకేసారి మార్కెట్లోకి వదులుతోంది. మొత్తానికి ఈ సమ్మర్‌లో ఒప్పో తమ కొత్త ప్రొడక్టులతో మార్కెట్లో సెగలు పుట్టించడం పక్కాగా కనిపిస్తోంది.

Also Read: రూ.8 వేలకే హోమ్ థియేటర్ సెటప్.. 20W స్పీకర్లు, మైక్స్‌తో ROAR ప్రొజెక్టర్ వచ్చేసింది!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×