Summer Sale 2026: ప్రస్తుతం బయట ఉన్న ఎండల తీవ్రతకు ఇంట్లో చల్లగా ఉండాలంటే ఫ్యాన్ల ద్వారా వీచే గాలి ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే జనాలు ఎలాగైన కూలర్లు గానీ ఏసీలు గానీ కొనాలి అనుకుంటుంటారు. అయితే సమ్మర్‌ను క్యాష్ చేసుకుందామని చాలా టెక్ సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచేసి సామాన్యులను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ తరుణంలో మధ్యతరగతి కుటుంబాలు కూడా వేసవిని హ్యాపీగా గడపాలని ప్రముఖ దిగ్గజం రిలయన్స్ డిజిటల్ ‘చిల్ ఫెస్ట్’ సేల్‌ను తీసుకొచ్చింది. ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్‌లు ఇలా ఏది కొనాలన్నా భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. ఎండలు బాగా పెరిగిన తర్వాత రేట్లు పెంచుతారనే టెన్షన్ లేకుండా.. ఇప్పుడే తక్కువ ధరకే మంచి వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చని రిలయన్స్ చెబుతోంది. కేవలం డిస్కౌంట్లే కాకుండా.. సామాన్యులకు భారమవ్వకుండా రకరకాల క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఈ సేల్ కస్టమర్లను ఊరిస్తోంది.
ఈ చిల్ ఫెస్ట్ సేల్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన విషయం ఏమిటంటే డబ్బు ఆదా అయ్యే మార్గాలు. మీరు గనక ప్రముఖ బ్యాంక్ కార్డులను వాడుతుంటే ఏకంగా రూ.20,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీని ద్వారా పేరున్న పెద్ద పెద్ద బ్రాండ్ల ఏసీలను కూడా చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఇక కార్డులు లేని వారి కోసం స్టోర్లలో పేపర్ ఫైనాన్స్ సౌకర్యం ఉంది. దీని ద్వారా కొనుగోలు చేస్తే రూ.30,000 వరకు క్యాష్‌బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు.
Also Read: రూ.8 వేలకే హోమ్ థియేటర్ సెటప్.. 20W స్పీకర్లు, మైక్స్‌తో ROAR ప్రొజెక్టర్ వచ్చేసింది!
చాలామందికి ఏసీ కొనాలని ఉన్నా.. ఒకేసారి అంత డబ్బు పెట్టడం కష్టమని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే రిలయన్స్ డిజిటల్ ఒక క్రేజీ స్కీమ్ తెచ్చింది. జస్ట్ ఒక్క రూపాయి ప్రారంభంలో చెల్లిస్తే చాలు.. కొత్త ఏసీని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలకు కొద్దికొద్దిగా ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు. అప్పు తీసుకుంటున్నామనే ఫీలింగ్ లేకుండా.. సులభమైన వాయిదాలలో ఏసీ సొంతం చేసుకోవడానికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఈ ఆఫర్ వల్ల ఈ వేసవిలో సామాన్యుల ఇళ్లలో కూడా చల్లటి ఏసీ గాలి సందడి చేయబోతోంది.
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ప్రస్తుతం ఆప్షన్లకు కొదవలేదు. ఇక్కడ 350కి పైగా ఏసీ మోడల్స్, 200 రకాల ఫ్రిడ్జ్‌లు, అలాగే 50కి పైగా కూలర్లు అందుబాటులో ఉన్నాయి. దేశీ బ్రాండ్ల నుండి ఇంటర్నేషనల్ బ్రాండ్ల వరకు అన్నీ ఒకేచోట చూడొచ్చు. కేవలం వస్తువు అమ్మడమే కాకుండా.. ఉచితంగా ఇంటికి డెలివరీ చేయడం, ఇన్‌స్టాలేషన్ చేయడం వంటివి కూడా కంపెనీయే చూసుకుంటుంది. దీనివల్ల మనకు రూ.1,500 వరకు ఆదా అవుతుంది. ఐదేళ్ల వారంటీతో పాటు రూ.9,590 విలువైన గిఫ్ట్‌లు కూడా గెలుచుకోవచ్చు. నాణ్యతతో పాటు మంచి సర్వీస్ ఇచ్చే చోట వస్తువులు కొంటే ఆ తృప్తే వేరు కదా.
Also Read: ఏంది సామీ ఇది.. రూ.9,999కే 5G ఫోన్, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, 6.9 ఇంచుల డిస్‌ప్లేనా!
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.