E-Paper
Advertisement

Oppo Reno 15 FS: రెనో 15 సిరీస్‌లో మిడ్ రేంజ్ మోడల్ లాంచ్.. 6500mAh బ్యాటరీతో అడ్వాన్స్ ఫీచర్లు

Oppo Reno 15 FS: రెనో 15 సిరీస్‌లో మిడ్ రేంజ్ మోడల్ లాంచ్.. 6500mAh బ్యాటరీతో అడ్వాన్స్ ఫీచర్లు
Advertisement

Oppo Reno 15 FS| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఓప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ Reno 15 FS 5Gని యూరోపియన్ దేశాల్లో లాంచ్ చేసింది. Reno సిరీస్‌ను ఓప్పో కంపెనీ భారతదేశం వెలుపల కూడా విస్తరిస్తోంది. ఈ మోడల్‌లో పెద్ద బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అడ్వాన్స్‌ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇటీవల భారతదేశంలో పరిచయం చేసిన ఓప్పో.. రెనో 15 సిరీస్‌లో భాగంగా ఈ కొత్త మోడల్ విడుదల చేసింది. బలమైన పర్‌ఫామెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్ కోరుకునే యూజర్లను ఓప్పో టార్గెట్ చేస్తోంది.

Oppo Reno 15 FS 5G ధర, అందుబాటు వివరాలు

రెనో 15 FS 5Gని పరిమిత యూరోపియన్ ప్రాంతాల్లో మాత్రమే లాంచ్ చేసింది ఓప్పో. పోలాండ్‌లోని Oppo అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ మార్కెట్లలో ఒకే కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్‌లో 8GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఓప్పో రెనో 15 FS 5G ధర PLN 1,599గా నిర్ణయించారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.40,600కి సమానం. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు భిన్నమైన బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

Advertisement

ఓప్పో రెనో 15 FS 5Gలో 6.57 ఇంచ్ Full HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2,372 × 1,080 పిక్సెల్స్‌గా ఉంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ కూడా ఉంది. Oppo ప్రకారం గరిష్ట బ్రైట్‌నెస్ 1,400 నిట్స్ వరకు ఉంటుంది. గారిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేను గీతల నుంచి కాపాడుతుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

రెనో 15 FS 5Gని స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ పవర్ చేస్తుంది. డైలీ టాస్క్స్, గేమింగ్‌కు బ్యాలెన్స్‌డ్ పనితీరు ఇస్తుంది ఈ చిప్‌సెట్. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉపయోగిస్తున్నారు. ఫోన్ బాక్స్ నుంచే Android 16తో వస్తుంది. ఇందులో ఓప్పో యొక్క కస్టమ్ ColorOS 16 ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా స్పెసిఫికేషన్స్, కెపాసిటీ

Advertisement

ఓప్పో రెనో 15 FS 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ సెన్సార్‌తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా విశాల దృశ్యాలను సెక్రేప్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, హై-రిజల్యూషన్ సెల్ఫీలకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్, రియర్ కెమెరాలు రెండూ 4K వీడియో 30fpsలో రికార్డ్ చేయగలవు.

కనెక్టివిటీ, సెన్సార్లు

డైలీ ఉపయోగానికి బహుళ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. Wi-Fi, Bluetooth, GPS, NFC, USB Type-C పోర్ట్ ఉన్నాయి. వివిధ సెన్సార్లు ఫోన్ ఫంక్షనాలిటీని మెరుగుపరుస్తాయి. ఎక్సిలరోమీటర్, గైరోస్కోప్ ఉన్నాయి. అంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ, ఈ-కంపాస్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రాడ్ యాప్స్.. వెంటనే వీటిని డెలీట్ చేయండి.. ప్రభుత్వ హెచ్చరిక

బ్యాటరీ, చార్జింగ్ టెక్నాలజీ

రెనో 15 FS 5Gలో 6,500mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్క సారి చార్జ్ చేస్తే ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు. 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఇది చార్జింగ్ సమయాన్ని చాలా తగ్గిస్తుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ రీచార్జింగ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది.

రెనో 15 FS 5Gని ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా Oppo పొజిషన్ చేసింది. పర్‌ఫామెన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీని కలిపి ఇస్తుంది. స్టైలిష్ డిజైన్‌తో ఆధునిక స్పెసిఫికేషన్లు కోరుకునే యూజర్లకు ఇది అనువైన మోడల్.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×